బాబు ఓడినా వ‌దిలిపెట్ట‌డా?

బాబు ఓడినా వ‌దిలిపెట్ట‌డు. బొమ్మాళీ అంటూ వెంటాడి వేధిస్తున్నాడు. ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ చంద్ర‌బాబుపై చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ఓవైపు ఎల‌క్ష‌న్ ముందు ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ బాబు ప‌రువు తీసే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ సినిమా ఎట్ట‌కేల‌కు ఫ‌లితాల అనంత‌రం రిలీజైపోతోంది.

ఇలా చంద్ర‌బాబు ఓడిపోయి వైయ‌స్ జ‌గ‌న్ సీఎం అవుతున్నారు అన‌గానే వ‌ర్మ సామాజిక మాధ్య‌మాల్లో క‌సి తీర్చుకున్నారు. బాబు తాజా స‌న్నివేశానికి అద్దంప‌డుతూ మీమ్స్ తో చెల‌రేగిపోయాడు. వ‌రుస ట్వీట్ల‌లో బాబుపై చెల‌రేగిపోయాడు. సామాజిక మాధ్య‌మాల్లో చంద్ర‌బాబు పై ర‌క‌ర‌కాల కామెంట్లు.. మీమ్స్ ని సేక‌రించి మ‌రీ వెంటాడాడు. వైయ‌స్ జ‌గ‌న్ కి హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు. నారా చంద్ర‌బాబునాయుడుకు హృద‌య‌విదార‌క సానుభూతిని తెలియ‌జేస్తున్నా అని వ‌ర్మ ట్వీట్ చేశారు. ర‌క‌ర‌కాల మీమ్స్ ని పోస్ట్ చేశారు.