ఆర్జీవీ ఇలా చేస్తాడ‌నుకోలేదు!

Last Updated on by

ఏదో చేస్తాడ‌నుకుంటే ఇంకేదో చేశాడు. చైన్ లాగి.. శివ రిజ‌ల్ట్‌ను, కొత్త ట్రెండును తెస్తాడ‌నుకుంటే ఇలా చేస్తాడ‌నుకోలేదు. అస‌లు ఆర్జీవీ అంటేనే కొత్త‌ద‌నం అని న‌మ్మిన అభిమానుల‌ను ఎన్న‌టికీ కోలుకోలేని చావు దెబ్బ కొట్టాడు. అస‌లు నాగార్జున‌-ఆర్జీవీ కాంబినేష‌న్ అన‌గానే `శివ‌` బ్యాచ్ చైన్ తెంచుతుంద‌ని, పైగా అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో సైకిల్ చైన్ సెట్ వేసి మ‌రీ ఓపెనింగ్ చేసేస‌రికి మ‌రోసారి అలాంటి మ్యాజిక్ రిపీట‌వుతుంద‌ని ఆశించిన అభిమానుల‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈసారి నిరాశ అనే ప‌దం చాలా త‌క్కువు. ఇది మామూలు నిరాశ కాదు. ఇంకెప్పుడు ఆర్జీవీ సినిమా చూడ‌కూడ‌దు. నాగార్జున ఇక ఎప్ప‌టికీ అన్న‌పూర్ణ కాంపౌండ్‌లో అత‌డిని అడుగ‌పెట్ట‌నివ్వ‌కూడదు అన్నంత కోపం వ‌చ్చింది అభిమానుల‌కు. ఇంత చెత్త సినిమా తీస్తాడ‌ని అనుకోలేదెవ‌రూ.

అన్న‌ట్టు ఆర్జీవీ అంటే సౌండింగ్‌లో పెద్ద తోపు అన్న పేరుంది. హాలీవుడ్ సౌండ్స్‌ని టాలీవుడ్‌కి దించిన ఘ‌నుడు అన్న న‌మ్మ‌కం అత‌డిపై ఉండేది. అయితే ప్ర‌యోగం పేరుతో, నేచురాలిటీ పేరుతో ఆఫీసర్ చిత్రానికి ఉప‌యోగించిన నేప‌థ్య సంగీతం అభిమానుల్ని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోయింది. ప‌ర‌మ రొటీన్ క‌థ‌, క‌థ‌నం, ఎలాంటి లాజిక్ లేని నేచుర‌ల్ పంథా పూర్తిగా బోర్ కొట్టించింది. అస‌లు స్క్రీన్‌ప్లే బేసిక్స్ తెలియ‌ని ఓ కొత్త కుర్రాడు తీసిన చందంగా ఆర్జీవీ సినిమా తీసి నిరాశ‌ప‌డేలా చేశాడు. ఆర్జీవీ నేచుర‌ల్ కాదు.. అన్ నేచుర‌ల్ అని ప్రూవ్ చేశాడు. ఇక క్లైమాక్స్ స‌న్నివేశంలో ల్యాగ్ అయితే మరీ బోర్ కొట్టించింది. ఓవైపు విశాల్ `అభిమ‌న్యుడు` లాంటి లాజిక‌ల్ సినిమాతో, బ‌ర్నింగ్ టాపిక్ తో వ‌స్తే, ఇటువైపు ఆర్జీవీ మ‌రీ పాత చింత‌కాయ సినిమా తీసి పెద్ద జోక్ అయిపోయాడు. ఇక రీరికార్డింగ్ ప‌రంగా అభిమ‌న్యుడు హాలీవుడ్ హైట్స్‌ని ట‌చ్ చేసింది. ఈ గుణ‌పాఠంతో ఆర్జీవీని ఎవ‌రైనా న‌మ్మితే ఒట్టు! డైహార్డ్ ఫ్యాన్స్ అయినా ఇక న‌మ్మే ప‌రిస్థితే లేదు.

User Comments