భూకంపంలో చిక్కుకున్న ఆర్జీవీ

Last Updated on by

అవును.. మీరు వింటున్న‌ది నిజ‌మే. ఆర్జీవీ అలియాస్ వివాదాస్ప‌ద రామ్‌గోపాల్ వ‌ర్మ భూకంప‌లో చిక్కుకుని విల‌విల‌లాడారు. అది అలాంటిలాంటి భూకంపం కాదు. భూమండ‌లం క‌దిలిపోయే భూకంపం. అస‌లింత‌కీ ఏమైంది? చెక్ దిస్ స్టోరి…

గ‌త కొంత‌కాలంగా ఆర్జీవీ కోరి త‌ల‌కొరివి పెట్టుకుంటూ ప్ర‌జ‌ల‌కు వినోదాన్ని పంచుతున్నాడు. ఆ క్ర‌మంలోనే మెగా ఫ్యామిలీ హీరో, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో పెట్టుకున్నాడు. శ్రీ‌రెడ్డి మిష‌తో రామ్‌గోపాల్ వ‌ర్మ విషం క‌క్కాడు. ఆ విష‌యం తిరిగి అత‌డినే కాటేసింది. దాని ప్ర‌భావం ఇప్పుడు ఆఫీస‌ర్‌కి చుట్టుకుంది. ఆర్జీవీ ఎఫెక్టుతో కింగ్ నాగార్జున‌నే షేక్ అయిపోయాడు. ఆఫీస‌ర్ టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు యూట్యూబ్‌లో ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ డిస్‌లైక్స్ కొడుతూ కొత్త యుద్ధానికి తెర తీయ‌డంతో ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితి. తాజాగా మ‌రోసారి ఈ వార్ మ‌రోసారి రెయిజ్ అయ్యింది. మొన్న రిలీజ్ చేసిన నాగార్జున ట్రైల‌ర్‌కి ఏకంగా 11 వేల డిస్‌లైక్స్ కొట్ట‌డంతో .. ట్విట్ట‌ర్లోకి వ‌చ్చిన ఆర్జీవీ .. ప‌వ‌న్‌కి ఇంత‌మంది ఫ్యాన్సేనా ఉన్న‌ది? జాలేస్తోంది అని టీజ్ చేశాడు. అంతేకాదు.. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఐక్యూ ఇంతేనా? క‌నీసం ట్రైల‌ర్ చూడ‌కుండానే డిస్‌లైక్స్ కొట్టారే! అంటూ మ‌రోసారి టీజింగ్ స్టార్ట్ చేశాడు.

అయితే ప‌వ‌న్ ఫ్యాన్స్ అందుకు ధీటుగా స్పందిస్తున్నారు. “నువ్ ఏమైనా ..కు.. ఏమైనా చెయ్‌.. ఆఫీస‌ర్ టీజ‌ర్ ఓపెన్ చేసి చూసేదే లేదు!“ అంటూ రీట్వీట్ చేశాడు ఓ ఫ్యాన్‌. “మీ అమ్మగారు, మీ కూతురు, మీ భార్యా అందరూ పీకే ఫాన్స్ అన్నావు.. వాళ్ళు కూడా డిస్‌లైక్స్‌ కొట్టి ఉంటారు పాపం….“ అంటూ విరుచుకుప‌డ్డాడో ఫ్యాన్‌. మొత్తానికి ఈ ట్వీట్ వార్ ఇంకా ఇంకా ముదిరి పాకాన ప‌డేట్టే క‌నిపిస్తోంది. ఇప్ప‌టికైతే ఆర్జీవీ, ఆఫీస‌ర్ ఇరువురూ భూకంపంలో చిక్కుకున్నారు. ఈ తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై అంత‌కంత‌కు పెరిగితే ఏకంగా పుట్టి మున‌గ‌డం ఖాయం. అయితే ఆర్జీవీ కంటే ఈ ఎపిసోడ్స్ వ‌ల్ల అత‌డిని న‌మ్మిన కింగ్ నాగార్జున మునిగిపోవ‌డం ఖాయం అన్న టాక్ న‌డుస్తోంది. ఇక ఆర్జీవీ ఎఫెక్టు ఎలానూ ఆఫీస‌ర్ బిజినెస్‌పైనా ప‌డింద‌ని సీక్రెట్‌గా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ గండం నుంచి గ‌ట్టేక్కేందుకు నాగ్ ఏం చేసినా ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంద‌ని చెప్పుకుంటున్నారు.

User Comments