దావూద్‌పై ఆర్జీవీ సిరీస్‌

Last Updated on by

ముంబై అండ‌ర్‌వ‌ర‌ల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీంపై వెబ్ సిరీస్ తెర‌కెక్క‌నుందా? అంటే అవున‌నే ప్ర‌క‌టించి షాకిచ్చాడు రామ్‌గోపాల్ వ‌ర్మ‌. ఇదివ‌ర‌కూ దావూద్‌పై సినిమా తీస్తున్నాడ‌ని ప్ర‌చార‌మైనా, ఇప్పుడు అది వెబ్ సిరీస్ మాత్ర‌మేన‌ని అత‌డు ప్ర‌క‌టించ‌డం విశేషం. దాయాది దేశం పాకిస్తాన్, దుబాయ్ వంటి చోట్ల త‌ల‌దాచుకుంటూ ఇప్ప‌టికీ ముంబై పోలీస్‌ని ముప్పు తిప్ప‌లు పెడుతున్న అండ‌ర్‌వ‌ర‌ల్డ్ కింగ్ గా దావూద్ పేరు మార్మోగుతోంది. అత‌డిని ఎట్టి ప‌రిస్థితిలో ప‌ట్టుకోవాల‌ని పోలీసులు చేస్తున్న ప్ర‌య‌త్నాలేవీ ఫలించ‌లేదు.

దాదాపు 20ఏళ్ల పాటు మాఫియాతో స‌త్సంబంధాలు సాగించిన వాడిగా వ‌ర్మ అత‌డిపై వెబ్ సిరీస్ తీస్తున్నాన‌ని ప్ర‌క‌టించ‌డం సంచ‌ల‌న‌మైంది. ఈ వెబ్ సిరీస్‌లో ప‌లు ఘ‌ట‌న‌ల్ని విజువ‌లైజ్ చేసి చూపిస్తాడ‌ట‌. 1993 ముంబై సీరియ‌ల్ బాంబ్ బ్లాస్ట్స్ , బాబ్రీ మ‌సీదు అల్ల‌ర్లకు దావూద్ అండ్ గ్యాంగ్స్ ఎలా కార‌ణ‌మ‌య్యాయో సిరీస్‌లో చూపిస్తాడ‌ట‌. అలానే బాలీవుడ్ తార‌లతో దావూద్ సంబంధాలపైనా య‌థాత‌థంగా చూపించేస్తాడ‌ట‌. 5 సీజన్లలో 10 ఎపిసోడ్స్‌గా ఈ సిరీస్ తెర‌కెక్కిస్తాన‌ని ప్ర‌క‌టించి మొత్తానికి అగ్గి రాజేశాడు.

User Comments