తెలుగ‌మ్మాయ్ ఎక్స్‌పెరిమెంట్‌

Last Updated on by

పెళ్లి చూపులు` ఫేం రీతూవ‌ర్మ స‌న్నివేశ‌మేంటి? అంత పెద్ద హిట్టు అందుకుని ఏడాది పైగానే అయ్యింది. ఇప్ప‌టివ‌ర‌కూ రీతూ న‌టించిన ఒక్క‌టంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. అస‌లేమైంది ఈ తెలుగ‌మ్మాయి? అంటే ఇదిగో స‌మాధానం.

పెళ్లి చూపులు` బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్ట‌డ‌మే గాక జాతీయ అవార్డు అందుకోవ‌డంతో రీతూ రేంజ్ ఒక్క‌సారిగా చుక్క‌ల్ని తాకింది. ఆ క్ర‌మంలోనే తెలుగు, త‌మిళ్ నుంచి డ‌జ‌న్ల కొద్దీ అవ‌కాశాలొచ్చాయి. కానీ చిన్నా చిత‌కా, అంత‌గా న‌టించే ఆస్కారం లేని సినిమాల్ని ప‌క్క‌న పెట్టేసిన రీతూ, నేరుగా చియాన్ విక్ర‌మ్ స‌ర‌స‌న గౌత‌మ్ మీన‌న్ ఇచ్చిన అవ‌కాశాన్ని అందిపుచ్చుకుంది. ప్ర‌స్తుతం చియాన్ `ధ్రువ‌న‌క్ష‌త్రం`లో నాయిక‌గా న‌టిస్తోంది. ఇదివ‌ర‌కూ చియాన్‌తో రేణు రొమాంటిక్ స్టిల్ ఒక‌టి ప్ర‌కంప‌నాలే రేపింది. తెలుగ‌మ్మాయ్ ఆ లెవ‌ల్లో ఉందిగా అంటూ పొగిడేశారంతా. ఇప్పుడు ఈ సినిమా నుంచి తొలి సింగిల్ రిలీజ్‌కి రెడీ అవుతోంది. హ్యారిష్ జైరాజ్ అంత‌టి ప్ర‌తిభావంతుడు ఈ చిత్రానికి సంగీతం అందించాడు. అంటే రీతూ బ్లాక్‌బ‌స్ట‌ర్ సాంగ్స్‌లో అదిరిపోయే డ్యాన్సుల‌తో అంద‌చందాల‌తో మ‌తి చెడ‌గొట్ట‌బోతోంద‌నే అర్థం. ఇక‌పోతే రీతూ చేస్తున్న ఈ భారీ ప్ర‌యోగం ఫ‌లిస్తుందా? ఆశించిన ఆ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్టొస్తుందా? అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్‌. ఇక క‌థానాయిక‌ల్ని గౌత‌మ్ మీన‌న్‌ అంటే ఓ రేంజులో చూపిస్తాడుగా. ఘ‌ర్ష‌ణ‌లో అసిన్‌కి వ‌చ్చినంత పేరొస్తుందేమో? లేదూ ఏమాయ చేశావేలో స‌మంత‌కు వ‌చ్చినంత పేరొస్తుందేమో? అని అంతా అంచ‌నా వేస్తున్నారు. ఆ రెండూ కాకుండా అప‌రిచితుడులో స‌దా లా పేరు తెచ్చుకుని మ‌రీ వెన‌క‌బ‌డుతుందా? అన్న‌ది కూడా ఆలోచించాలి.

User Comments