రియా కు లక్ కలిసిరావట్లేదు

Last Updated on by

బాలీవుడ్ లో కొంద‌రు హీరోయిన్ల‌కు ఎప్ప‌టికీ గుర్తింపు రాదు. అలాంటి ముద్దుగుమ్మ‌ల్లో ముందుండే పేరు రియాసేన్..! ఇండ‌స్ట్రీకి వ‌చ్చి పుష్క‌రం దాటేస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ ఇమేజ్ తెచ్చుకోలేదు. పైగా అందాల ఆర‌బోత‌లో కూడా ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాదు ఈ భామ‌. అడిగితే న్యూడ్ గా న‌టించ‌డానికి కూడా రెడీ అంటుంది.. న‌టించింది కూడా. కానీ ఏం చేస్తాం ఇప్ప‌టి వ‌ర‌కు క్రేజ్ రాలేదు. ఇప్పుడు సినిమాలు మానేసి.. ఎం చ‌క్కా హాట్ వెబ్ సిరీస్ లు చేసుకుంటుంది రియా.

ఈ మ‌ధ్యే పెళ్లైనా కూడా ఇప్ప‌టికీ అందాల ఆర‌బోత మాత్రం ఆప‌డం లేదు రియాసేన్. కెమెరా క‌నిపిస్తే చాలు అందాల‌న్నీ దానికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఇదే చేసింది. ఎల్ కే జీ క్యాస్ట్యూమ్స్ కూడా అంత‌కంటే ఎక్కువ‌గా ఉంటాయేమో అనేంత‌గా రెచ్చిపోయింది రియాసేన్. బికినీతో పాటు అన్ని క్యాస్ట్యూమ్స్ లోనూ అద‌ర‌గొట్టింది రియా. మొత్తానికి ఈ భామ దూకుడు చూస్తుంటే అయ్యో పాపం అనిపించ‌క మాన‌దు. ఆ మ‌ధ్య తెలుగులో కూడా మ‌నోజ్ తో నేను మీకు తెలుసా అంటూ ప‌ల‌క‌రించింది. కానీ ప్రేక్ష‌కులు మాత్రం మీకు మాకు తెలియ‌దు అంటూ తిప్పి పంపించేసారు. పోనీ బాలీవుడ్ లో అయినా నెగ్గుకొస్తుందేమో అంటే అక్క‌డా ఈ భామ‌కు నిరాశే మిగిలింది.

User Comments