హీరోయిన్ పెళ్ళికి కారణం ప్రెగ్నెన్సీ..?

 

టాలీవుడ్ లో మంచు మనోజ్ సరసన నేను మీకు తెలుసా అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ భామ రియా సేన్ రీసెంట్ గా తన బాయ్ ఫ్రెండ్ ను హడావుడిగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసే ఉంటుంది. దీంతో అలనాటి అందాల తార మున్ మున్ సేన్ కూతురైన రియా సేన్.. అంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా అంత హడావుడిగా, సింపుల్ గా, ఏ హంగామా లేకుండా పెళ్లి చేసుకోవడంతో చాలామందికి చాలానే అనుమానాలు కలిగాయి.
అందుకే అసలు విషయం ఏంటా అని ఆరా తీసిన కొన్ని ప్రముఖ ఛానల్స్ ఇప్పుడు ఓ హాట్ న్యూస్ ను ప్రచారం చేస్తున్నాయి. అదేంటంటే, హీరోయిన్ రియా సేన్ పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిందట. ఇలా సెలబ్రటీ లైఫ్ స్టైల్లో పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ కావడం పెద్ద షాకింగ్ న్యూస్ కాకపోయినా.. రియా సేన్ ఫ్యామిలీ మాత్రం చిన్న బ్యాడ్ కూడా నేమ్ రాకూడదని, ఆ విషయాన్ని దాచి హడావుడిగా పెళ్లి చేసినట్లు మీడియా సంస్థలు చెప్పుకొస్తున్నాయి. ఇదిలా ఉంటే, రియా సేన్ ప్రస్తుతం పెళ్లి చేసుకున్న తన బాయ్ ఫ్రెండ్ శివమ్ తివారితో ఆరేడేళ్ల క్రితం నుంచే ప్రేమలో ఉందట.
ఈ క్రమంలోనే రీసెంట్ గా రియాసేన్ ప్రెగ్నెంట్ కావడంతో.. 35 ఏళ్ళ వయస్సులో ఇప్పుడు హడావుడిగా పెళ్లి చేసుకుందని అంటున్నారు. ఇకపోతే, బాలీవుడ్ లో ఇలా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయి.. తర్వాత పెళ్లి చేసుకున్న అందాల భామలు చాలా మందే ఉన్నారనే విషయం తెలిసే ఉంటుంది. అంతెందుకు మన అతిలోక సుందరి శ్రీదేవి కూడా బోనీకపూర్ ను పెళ్లాడే సమయానికే ఏడు నెలల ప్రెగ్నెన్సీతో ఉందని సమాచారం. ఈ విషయాన్ని పెళ్లి తర్వాత శ్రీదేవే కన్ఫర్మ్ చేసిందనుకోండి అది వేరే విషయం. ఇక ఇప్పుడు రియా సేన్ విషయంలో మాత్రం ఈ తాజా ప్రెగ్నెన్సీ విషయంలో ఎవరు ఓపెన్ గా స్పందిస్తారో చూడాలి.