అసిస్టెంట్ తో రామ్ చ‌ర‌ణ్ సినిమా?

Last Updated on by

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వెంట ఓ బ్యాచ్ ఉంటుంది. చ‌ర‌ణ్ ఏ సినిమా చేసినా? ఆ సినిమాకు అసిస్టెంట్లు డైరెక్ట‌ర్లుగా ప‌నిచేస్తుంటారు ఆ న‌లుగురు. నిర్మాణ సంస్థ‌తో గానీ, డైరెక్ట‌ర్ తోగానీ! సంబంధం లేకుండా చ‌ర‌ణ్ ప‌ర్స‌న‌ల్ గా మెయింటెన్ చేసే అసిస్టెంట్లు వాళ్లు. అందుకే ఆన్ సెట్స్ లో చ‌ర‌ణ్ ఎక్క‌డ ఉంటే అక్క‌డ ఆ న‌లుగురు క‌చ్చితంగా వాలిపోతారు. ఆ న‌లుగుర్ని చ‌ర‌ణ్ కి గీతా ఆర్స్ట్ ద్వారా ప‌రిచ‌యం. ఆ సంస్థ లో ఆ న‌లుగురు చాలా సినిమాల‌కు అసిస్టెంట్లు డైరెక్ట‌ర్లుగా ప‌నిచేసారు. ఆ రిలేష‌న్ కార‌ణంగా చ‌ర‌ణ్ తో సాన్నిహిత్యం ఏర్ప‌డింది. వాళ్ల పేర్లు ఏంట‌న్న‌వి తెలియ‌దు గానీ! అందులో ఓ కుర్రాడిప్పుడు చ‌ర‌ణ్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కాబోతున్న‌ట్లు గీత ఆర్స్ట్ వ‌ర్గాల నుంచి తెలిసింది.

వాస్త‌వానికి గత‌ రెండున్న‌రేళ్ల నుంచి చ‌ర‌ణ్ తో సినిమా చేయాల‌ని ప్ర‌య‌త్నాల్లో భాగంగా ప‌లు క‌థ‌లు వినిపించాడు. కానీ డెబ్యూ కావ‌డంతో చ‌ర‌ణ్ ఓ చిన్న డెమో తీసి చూపించమ‌ని ప్ర‌పోజ‌ల్ పెట్టాడుట‌. ఇటీవ‌లే సోష‌ల్ కాజ్ తో కూడిన ఓ డెమో చూసి చూపించాడుట‌. డెమో మేకింగ్ న‌చ్చ‌డంతో మంచి క‌థ సిద్దం చేసుకునిరా! సినిమా చేద్ద‌మాని ప్రామిస్ చేసాడుట‌. చ‌ర‌ణ్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎస్టాబ్లిష్డ్ స్టార్ డైరెక్ట‌ర్ల‌తోనే సినిమాలు చేసాడు. అసిస్టెంట్ డైరెక్ల‌ర్ల‌తో సినిమాలు చేసింది లేదు. ఈ నేప‌థ్యంలో తొలిసారి ఓ యువ అసిస్టెంట్ కి పెద్ద ఛాన్స్ ఇచ్చిన‌ట్లు అయింది. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ `ఆర్ ఆర్ ఆర్` లో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత చ‌ర‌ణ్ ఏ డైరెక్ట‌ర్ కి క‌మిట్ అయింది లేదు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సినిమా త‌న అసిస్టెంట్ తో సినిమా చేసే అవ‌కాశాలున్నాయ‌ని గుస గుస‌లు మొద‌ల‌య్యాయి.

Also ReadRRR Press Meet Latest Stills

User Comments