500 కోట్లు.. ఇదీ కొత్త మాట‌

Last Updated on by

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 2.ఓ (రోబో2) బ‌డ్జెట్ అంత‌కంత‌కు రెట్టింప‌వుతోందా? అంటే అవున‌నే తాజా స‌న్నివేశం చెబుతోంది. తొలుత ఈ సినిమా బ‌డ్జెట్ 300 కోట్లు అన్న ప్ర‌చారం సాగింది. అటుపై 400 కోట్లు అంటూ కొత్త ప్ర‌చారం ఊపందుకుంది. ఇప్పుడు ఏకంగా 500 కోట్ల‌కు ఎగ‌బాకింద‌న్న‌ది తాజా తాజా రిపోర్ట్‌. ఉన్న‌ట్టుండి 100 కోట్లు అద‌నంగా దేనికి ఖ‌ర్చు చేశారు? అని ప్ర‌శ్నిస్తే తెలిసిన వివ‌రం ఇదీ..

ర‌జ‌నీకాంత్, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 2.ఓ (రోబో2)ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నిర్మాణానంత‌ర ప‌నుల్లో జాప్య ం రిలీజ్ పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ఇదివ‌ర‌కూ పూర్త‌యిన‌ వీఎఫ్ఎక్స్ వ‌ర్క్ ద‌ర్శ‌కుడు శంక‌ర్‌కి న‌చ్చ‌క‌పోవ‌డంతో, అదే ప‌నిని పెర్ఫెక్ష‌న్ కోసం రిపీట్ చేయిస్తున్నార‌ని, హాలీవుడ్ లెవ‌ల్లో సాంకేతిక‌త‌ను వినియోగిస్తున్నార‌ని తెలుస్తోంది. ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఏమాత్రం ప‌ట్టు విడ‌వ‌క సినిమాని సాంకేతికంగా అత్యున్న‌త ప్ర‌మాణాల‌తో తీర్చిదిద్దే ప్ర‌య‌త్న ంలో భాగంగా గ్రాఫిక్స్ కోసం అసాధార‌ణంగా బ‌డ్జెట్‌ని పెంచార‌ని తెలుస్తోంది. 2.ఓ బ‌డ్జెట్ 400 కోట్లు కాదు.. 500 కోట్లకు పెంచార‌న్న ప్ర‌చారం ప్ర‌స్తుతం హోరెత్తిపోతోంది. కేవ‌లం వీఎఫ్ఎక్స్‌ కోసం మ‌రో 100 కోట్లు అద‌నంగా పెంచారనేది ప్ర‌స్తుత ప్ర‌చారం. ఈ సినిమా 2019 సంక్రాంతికి రిలీజ‌వుతుందా? అంటే సందేహ‌మేనని తెలుస్తోంది. 2019 రిప‌బ్లిక్‌డే కానుక‌గా రిలీజ్ చేసేందుకు శంక‌ర్ స‌న్నాహాలు చేస్తున్నారు. 26 జ‌న‌వ‌రి 2019 రిలీజ్ తేదీ ఖాయ‌మైన‌ట్టేన‌ని ఇప్ప‌టికి అభిమానులు భావిస్తున్నారు. అయితే స‌మ్మ‌ర్ వ‌ర‌కూ వాయిదా ప‌డినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చిన సంగ‌తి తెలిసిందే.

User Comments