రోజా కుమార్తె హీరోయిన్‌గా?

90ల‌లో న‌టి రోజా అగ్ర క‌థానాయిక‌గా వెలుగొందిన సంగ‌తి తెలిసిందే. ఇండ‌స్ట్రీ అగ్ర క‌థానాయ‌కులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున‌, వెంక‌టేష్ ల స‌ర‌స‌న రోజా న‌టించారు. అప్ప‌ట్లో స‌మ‌కాలిక స్టార్లంద‌రి స‌ర‌స‌న నటించి గొప్ప అభిన‌య‌నేత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల‌కు విరామం ఇచ్చి అటుపై బుల్లితెర‌పైనా హోస్ట్ గా ప‌లు కార్య‌క్ర‌మాల్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. జ‌బర్ధ‌స్త్ యాంకర్ గానూ రోజా పెద్ద స‌క్సెస‌య్యారు. అయితే రోజా త‌ర్వాత త‌న న‌ట వార‌సురాలు సినీఆరంగేట్రం చేస్తారా? అంటూ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఇక‌పోతే రోజా కుమార్తె అన్షు మాళిక ఇప్ప‌టికే బాల‌న‌టిగా ప్ర‌య‌త్నించిన సంగ‌తి తెలిసిందే. వెండితెర నాయిక‌గానూ రంగ ప్ర‌వేశం చేయ‌బోతున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. కానీ  అన్షు వెండితెర ఎంట్రీకి సంబంధించి ఇటీవ‌ల‌ స‌రైన స‌మాచారం లేదు. అన్షు వ‌య‌సు ఇప్ప‌టికే 16. ఇక క‌థానాయిక‌గా ఆరంగేట్రం చేసేందుకు స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని తాజాగా ఓ సోర్స్ చెబుతోంది. వైకాపా మ‌హిళా నాయ‌కురాలిగా ఇంత‌కాలం ప్ర‌జాసేవ‌లో పూర్తి బిజీగా ఉన్న రోజా కుమార్తె సినీకెరీర్ గురించి దృష్టి సారించ‌లేక‌పోయారు. తాజాగా ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచారు కాబ‌ట్టి కూతురు ఎంట్రీకి ఇక లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఎల‌క్ష‌న్ కి ముందు రోజా మ‌న‌సులో మాట ఇదీ అంటూ ఓ ప్ర‌చారం తెర‌పైకొచ్చింది. 2019 ఎన్నిక‌ల్లో గెలిస్తే  కుమార్తెను పెద్ద తెర‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని రోజా స‌న్నిహితుల వ‌ద్ద అన్నార‌ని చెప్పుకున్నారు. తాజాగా నేటి రిజ‌ల్ట్ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ‌చ్చింది. త‌మ అధినాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్ చ‌క్క‌ని మెజారిటీతో గెలిచారు. ఈనెల 30న‌ ముఖ్య‌మంత్రి గా ప్ర‌మాణ స్వీకారం చేయ‌బోతున్నారు. అధినాయ‌కుడి గెలుపు.. పార్టీ గెల‌పు.. త‌న విక్ట‌రీ నేప‌థ్యం రోజాలో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది. ఈ విజ‌యాన్ని ప్ర‌స్తుతానికి పూర్తిగా ఆస్వాధిస్తారు. కొంత గ్యాప్ తీసుకుని.. గెలుపు హుషారులో ఇక కుమార్తె వెండితెర ఆరంగేట్రానికి ప‌క్కా ప్ర‌ణాళిక సిద్ధం చేస్తార‌ని చెప్పుకుంటున్నారు. ఇక రోజా కుమార్తె  అన్షు మాళిక లో క‌థానాయిక ఫీచ‌ర్స్ ఎంత‌వ‌ర‌కూ అంటే రోజాను మించిన స్పార్క్ త‌న‌లో ఉంద‌ని స‌న్నిహితులు విశ్లేషిస్తున్నారు. సౌత్ ఇండ‌స్ట్రీస్ లో క‌థానాయిక‌గా రాణించేందుకు అన్ని ర‌కాల అర్హ‌త‌లు అన్షులో ఉన్నాయ‌న్న మాటా వినిపిస్తోంది. న‌ట‌వార‌సురాలిగా అన్షు రాణించేందుకు ఆస్కారం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

Also Read: Pawan Promised People On His Failure!