రోజురోజుకు దిగజారుతున్న రోజా..

రోజా.. ఒక‌ప్పుడు ఈ పేరుకు ఇండ‌స్ట్రీలో మంచి క్రేజ్ ఉండేది. హీరోయిన్ గా 100 సినిమాలకు పైగానే న‌టించింది ఈమె. ఇప్పుడు రోజా ఓ ఎమ్మెల్యే. రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న‌దైన ముద్ర కూడా వేసింది. ప్ర‌స్తుతం వైఎస్ఆర్సిపీలో ఉంది. త‌మ పార్టీని ఎవ‌రేం అన్నా నోరేసుకుని ప‌డిపోవ‌డం రోజాకు ఉన్న ప్ర‌త్యేక‌థ‌. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కూడా ఇలాగే నోరు పారేసుకుంది ఈ మాజీ హీరోయిన్. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తూ వాడు వీడు అనేసింది ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప‌వ‌ర్ స్టార్ లాంటి హీరోను ఓ మాట అనాలంటే పెద్దోళ్లే కాస్త ఆలోచిస్తారు కానీ ఈమె మాత్రం ఈజీగా నోరు పారేసుకుంది.. ఇష్ట‌మొచ్చిన‌ట్లు మాట్లాడేసింది.

ఇక ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా మాట్లాడ్డానికి వ‌చ్చిన బండ్లగ‌ణేష్ ను అయితే ఏకంగా ప‌వ‌న్ కు ప‌క్క‌లేస్తావా అంటూ చీప్ గా మాట్లాడేసింది. లైవ్ లోనే ఈమె మాట్లాడిన తీరుకు అంతా ముక్కున వేలేసుకున్నారు. ఇక ప‌వ‌న్ ను చిరంజీవి లేక‌పోతే ప‌వ‌న్ అనేవాడు లేడు.. ఈయ‌న‌తో ఎవ‌డు సినిమా చేస్తాడు.. ఎవ‌డు చూస్తాడంటూ నీచంగా మాట్లాడేసింది. రోజా మాట్లాడిన తీరుపై ఇప్పుడు ఇండ‌స్ట్రీలో కూడా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అస‌లు ఓ తోటి న‌టుడ్ని ఇలా అవ‌హేళ‌న చేస్తున్న‌ట్లు మాట్లాడ‌టం ఎంత‌వ‌ర‌కు క‌రెక్ట్ అంటూ ఈమెపైనే రివ‌ర్స్ సెటైర్లు వేస్తున్నారు.
ప‌వ‌న్ లాంటి ఛ‌రిష్మా ఉన్న హీరోను ప‌ట్టుకుని అంత మాటలంటే అభిమానులు చూస్తూ ఊరుకుంటారా అందుకే ఈమెకు స్ట్రాంగ్ గానే రివ‌ర్స్ కౌంట‌ర్లు కూడా ప‌డుతున్నాయి. రాజ‌కీయాల్లో వార‌స‌త్వం ప‌నికిరాదు.. నిరూపించుకుని రావాలి అంటూ ప‌వ‌న్ మాట్లాడిన మాట‌లపై రోజా స్పందించింది.

చిరు లేక‌పోతే ప‌వ‌న్ లేడు.. ఎవ‌డు వాడు అని రోజా మాట్లాడిన మాట‌ల‌కు బండ్ల‌గ‌ణేష్ కూడా ఘాటుగానే స్పందించాడు. నువ్వు కూడా నేరుగానే హీరోయిన్ అయ్యావు క‌దా.. మాకు తెలియ‌దా అంటూ రివ‌ర్స్ అటాక్ చేసాడు. గ‌తంలోనూ తోటి శాస‌న స‌భ్యురాలిని నాలుక చూపించినందుకు ఏడాది పాటు స‌స్పెండ్ అయింది రోజా. ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ విష‌యంలో నోటి దురుసు చూపించింది. మొత్తానికి రోజా మాట‌ల వ్య‌వ‌హారం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది.