వామ్మో.. అన్నా చెల్లెళ్లపై ఇంటిమేట్ లవ్ స్టోరీ

మన దేశంలో సెంటిమెంట్స్ – దాని చుట్టూ అల్లుకునే వివాదాలు కొత్తేమీ కాదు. ముఖ్యంగా కొన్ని సెంటిమెంట్స్ కు ఉండే హద్దులు దాటి ఓ సినిమా వచ్చిందంటే.. అది ఎంతలా వివాదాస్పదం అవుతుందో, దాని కారణంగా ఎంత రచ్చ జరుగుతుందో ఇప్పటికే చాలాసార్లు చూశాం. అర్జున్ రెడ్డి లాంటి బోల్డ్ లవ్ స్టోరీపైనే మనకు ఇక్కడ బోలెడంత చర్చ మరియు రగడ జరిగాయి. ఇక బాలీవుడ్ లో అయితే, తాడూ బొంగరం లేని సంబంధాలపై తీసే కొన్ని సినిమాలు కూడా ఇలానే వివాదాలతో మునుగుతూ తేలుతూ ఉంటాయి. ఇప్పుడు ఇంచుమించు అలాంటిదే.. పెద్ద వివాదాన్నే రాజేయడానికి ఓ సినిమా వస్తోంది.
అది అలాంటి ఇలాంటి సినిమా కాదు. ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి సబ్జెక్టును డిస్కస్ చేయడం ఇదే తొలిసారి అనే ప్రచారంతో వస్తుందంటేనే మేటర్ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకూ మేటర్ ఏంటంటే, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తొలిసారిగా అన్నా చెల్లెళ్ల మధ్య ప్రేమపై ఓ సినిమా వస్తోంది. ఇక్కడ ప్రేమ అంటే, అదేదో గోరింటాకు సినిమా తరహాలో ఉంటుందని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే, సదరు మేకర్స్ ఇప్పుడు ఆ అన్నా చెల్లెళ్ళ మధ్య సమాజం అంగీకరించలేని సంబంధం గురించి తమ సినిమాతో డిస్కస్ చేయబోతున్నారట. వినడానికే షాకింగ్ గా అనిపించే ఈ కథను.. మనోజ్ జయంతి లాల్ భాటి అనే డైరెక్టర్ ‘ఐయామ్ రోషిణి’ అనే టైటిల్ తో తెరకెక్కించారు.
దీనికి సంబంధించిన ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేస్తే.. ఇందులో అన్నా చెల్లి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాన్నే చర్చించారని క్లియర్ గా అర్థమైపోతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా పెద్ద వివాదానికే దారితీసేలా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ సినిమా రోషిణి అనే అమ్మాయి జీవితం చుట్టూ తిరగగా.. తన కుటుంబంలోని అందరూ ఆమెను మానసికంగా హింసిస్తున్న టైమ్ లో అండగా నిలిచిన అన్నతో ఆమె అనుబంధాన్ని ఏర్పరుచుకున్న పరిస్థితులను చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ట్రైలర్ చివర్లో కూడా.. ఏన్ ఇంటిమేట్ లవ్ స్టోరీ ఆఫ్ ఎ బ్రదర్ అండ్ ఎ సిస్టర్ అంటూ చెప్పడం కూడా షాక్ ఇస్తోంది. కానీ, సినిమాలో మాత్రం ఎలాంటి వల్గర్ సీన్స్ ఉండవని మేకర్స్ చెబుతుండటం గమనార్హం.
ట్రైలర్ :

Follow US