వెంకీ మామ‌ రొటీన్ ట్యూనేగా

Venky Mama - File Photo

విక్టరీ వెంకటేశ్- యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా రూపొందుతోన్న చిత్రం `వెంకీమామ`. కె.ఎస్‌.ర‌వీంద్ర‌(బాబీ) ద‌ర్శ‌కుడు. సురేశ్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకాల‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గురువారం ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ సాంగ్‌ను తొలిసాంగ్‌గా చిత్ర యూనిట్ సోష‌ల్ మీడియా ద్వారా విడుద‌ల చేసింది.

ఈ సాంగ్‌కు అభిమానుల నుంచి స్పంద‌న బావున్నా.. క్రిటిక్స్ నుంచి మాత్రం రొటీన్ ట్యూన్ అన్న విమ‌ర్శ ఎదురైంది. 10ల‌క్ష‌ల‌ వ్యూస్‌తో యూ ట్యూబ్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఉన్నా.. బాణీలో కొత్త‌ద‌నం ఏం ఉంది.. రొటీన్ థ‌మ‌న్ బాణీ అంటూ విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇక ఈ సాంగ్ మామ‌, అల్లుడు మ‌ధ్య ఉండే అంద‌మైన అనుబంధాన్ని తెలియ‌చేస్తుంది. మ్యూజిక్ సెన్సేష‌న్ ఎస్‌.ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో టైటిల్ సాంగ్‌ను శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. సింపుల్‌, అర్థ‌మ‌య్యేలా ఈ పాట సాహిత్యాన్ని రామ‌జోగ‌య్య‌శాస్త్రి అందించారు. రాశీ ఖ‌న్నా, పాయ‌ల్ రాజ్‌పుత్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.