రౌడీ ఫైట‌ర్ కాదు బాక్స‌ర్ అట‌

రౌడీ విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ఓ సినిమాకి స‌న్నాహాలు చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. పూరి జ‌గ‌న్నాథ్- ఛార్మి కౌర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడింది. ప్ర‌స్తుతం లొకేష‌న్ల వేట సాగిస్తున్న టీమ్ త్వ‌ర‌లోనే సెట్స్ కి వెళ్లేందుకు స‌న్నాహాలు చేస్తోంద‌ట‌. ఈ చిత్రానికి ఫైట‌ర్ అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాలో దేవ‌ర‌కొండ ఎలాంటి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు? అంటే టైటిల్ కి త‌గ్గ‌ట్టే అత‌డు బాక్స‌ర్ గా క‌నిపిస్తాడ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే దేవ‌ర‌కొండ ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ కోసం ట్రైనింగ్ తీసుకుంటున్నార‌ని తెలుస్తోంది. అలాగే విజ‌య్ స‌ర‌స‌న నాయిక‌ల్ని వెతుకుతున్నార‌ట‌.

`ఇస్మార్ట్ శంక‌ర్`తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టిన పూరి రెట్టించిన ఉత్సాహంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మ‌రోవైపు డియ‌ర్ కామ్రేడ్ ఫ్లాప్ తో దెబ్బ తిన్న రౌడీ తిరిగి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాల‌న్న క‌సితో ప‌ని చేస్తున్నాడ‌ట‌. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా మైత్రి మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న `హీరో` కొంత భాగం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా త‌దుప‌రి షెడ్యూల్స్ కి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.