రౌడీ ల‌వ‌ర్ రుస‌రుస దేనికి

Rashmika Mandanna out of Dil Raju camp

రౌడీ హీరోయిన్ గీత‌కు కోప‌మొచ్చింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్రోల‌ర్స్ ని ఉతికి ఆరేసింది. గ‌త కొంత కాలంగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ర‌ష్మిక మంద‌న్న ప్రేమాయ‌ణం సాగిస్తోందంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ వ‌ర్గం ర‌ష్మిక‌పై తీవ్ర‌ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. దీనికి క‌న్న‌డ యూత్ సైతం వంత‌పాడుతూ మ‌రీ ట్రోలింగ్ క‌ల్చ‌ర్ కి ఆజ్యం పోశారు. తాజాగా ర‌ష్మిక‌ని బూతులు తిడుతూ కొంత మంది అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలంతో సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా ర‌ష్మిక‌ను ట్రోల్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ట్రోలింగ్ హ‌ద్దులు దాట‌డంతో ర‌ష్మిక ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.

ర‌ష్మిక చిన్న నాటి ఫొటోల‌కు ట్యాగ్ చేస్తూ నెటిజ‌నులు వీరంగం వేయ‌డాన్ని ర‌ష్మిక గుర్తించింది. `ఈ లిటిల్ గాళ్‌.. ఒక‌ ఇంట‌ర్నేష‌న‌ల్ *** (బూతు) అవుతుంది భ‌విష్య‌త్ లో` అంటూ తీవ్ర‌మైన ప‌ద‌జాలంతో ఓ పోస్ట్ పెట్ట‌డంతో అది కాస్తా ర‌ష్మిక‌కు తీవ్ర ఆగ్ర‌హాన్ని తెప్పించింది. తాజాగా ఈ పోస్ట్ పై ర‌ష్మిక ఘాటుగానే స్పందించింది.  త‌న‌ని ట్రోల్ చేస్తున్న వారికి ధీటుగా స‌మాధానం చెప్పి గూబ గుయ్ మ‌నిపించింది. “న‌టీన‌టులంటే ఎందుకంత చిన్న‌చూపు. తామే ఎందుకు ప్ర‌తీ ఒక్క‌రికీ సాఫ్ట్ టార్గెట్ అవుతున్నామో అర్థం కావ‌డం లేదు. సినిమాల్లో నా పాత్ర‌ల గురించి.. నా న‌ట‌న గురించి ట్రోల్ చేయండి. ఆ హ‌క్కు మీకుంది. అయితే నా వ్య‌క్తిగా జీవితం గురించి.. నా కుటుంబం గురించి మాట్లాడే హ‌క్కు ఎవ్వ‌రికీ లేదు. వేధిస్తున్నా ప‌ట్టించుకోవ‌ద్ద‌ని చాలా కాలంగా కొంద‌రు చెప్పారు. నేనూ వారి మాట‌ల‌కు విలువిచ్చి ఆ దూష‌ణ‌ల్ని పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. వ్య‌క్తిగతంగా నే కాకుండా ఫ్యామిలీని కూడా ట్రోల్ చేస్తే ప‌రిణామాలు ఎలా వుంటాయో చూపిస్తాను“ అంటూ తీవ్రంగానే హెచ్చ‌రించింది ర‌ష్మిక‌. ఇక ప్ర‌స్తుతం భీష్మ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న ర‌ష్మిక ఓ కొంటె ట్వీట్ చేసింది. తాజాగా రిలీజ్ చేసిన మోష‌న్ పోస్ట‌ర్ లో నితిన్ ప్ర‌వ‌ర్త‌న‌ను ఉద్ధేశించి.. “ఇందుకేనా భీష్మా నువ్వు ఒంట‌రిగా ఉన్నావ్!?“ అంటూ ట్వీట్ చేసింది.