అభిమానుల‌కు రౌడీ స్టార్ పిలుపు

రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న అభిమానుల‌కు పిలుపు నిచ్చాడు. హైద‌రాబాద్ లో నీళ్ల‌ను పొదుపు గా వాడాలని, వృద్దా చేస్తే మ‌న సినిమా అయిపోయిన‌ట్లేన‌ని నిన్న‌టి రోజున కౌస‌ల్య కృష్ణ‌మూర్తి ప్రీ రిలీజ్ వేడుక సంద‌ర్భంగా సూచించాడు. నీటిని వృద్ధా చేసిన‌ట్లు అయితే 2022 కు హైద‌రాబాద్ లో చుక్క నీరు దొర‌క‌కుండా అయిపోతుంద‌నిని, అందుకోసం సిటీ వాసులంతా నీటిని ఎంత పొదుపు గా వాడితే సిటీని అంత‌గా కాపాడుకున్న వాళ్లం అవుతామ‌ని తెలిపాడు.

నీళ్ల విషయంలో ఎవ‌రైనా ఒక్క‌టే. స్టార్ హీరో కి కోట్ల రూపాయ‌లు ఉన్నాయ‌ని నీళ్లు కొద్ది రోజులు దొరుకుతాయేమో కానీ, త‌ర్వాత ఎవ‌రి ప‌రిస్థితి అయినా నీళ్ల కోసం కొట్టుకోవాల్సిందే. ఇటీవ‌లే నా వాష్ రూమ్ లో నీళ్లు రాలేదు. కార‌ణం ఏంట‌ని ఆరా తీస్తే ఈ విష‌యాల‌న్ని తెలిసాయి. కాబ‌ట్టి అంతా నీటిని పొదుపు గా వాడండని సూచించాడు. ప్ర‌జ‌లంద‌ర‌కి ప‌రిస్థితిని వివ‌రించాల‌ని, అవేర్ నెస్ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని తెలిపాడు. దీనిపై ఇప్ప‌టికే కొంత మంది హీరోలు స్పందించాడు. కానీ టాప్ స్టార్లు ఎవ్వ‌రూ దీనిపై స్పందిచ‌క‌పోవ‌డం శోచ‌నీయం. సందేశాలు సినిమాల్లో త‌ప్పా…రియ‌ల్ లైఫ్ లో ఇచ్చే హీరోలు లేరిక్క‌డ‌.