RRR వీరుల‌తో భ‌గ‌త్ సింగ్ ట్విస్ట్‌?

Last Updated on by

రామారావు- రామ్ చ‌ర‌ణ్‌- రాజ‌మౌళి కాంబినేష‌న్ మ‌ల్టీస్టార‌ర్ రిలీజ్ తేదీ స‌హా ఇత‌ర‌త్రా వివరాల్ని ఇటీవ‌లే వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నార‌ని, అది విల‌న్ పాత్ర కానేకాద‌ని ఎస్.ఎస్.రాజ‌మౌళి తెలిపారు. తెలంగాణ గిరిజ‌న వీరుడు, ఫ్రీడ‌మ్ ఫైట‌ర్ కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తుండ‌గా, ఆంధ్రా మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నార‌ని, మీరు చూసిన వీరులు కాకుండా కొత్త త‌ర‌హా వీరుల్ని చూపిస్తున్నాన‌ని, ఫిక్ష‌న్ జోడించామ‌ని రాజ‌మౌళి చాలా స్ఫ‌ష్టంగా చెప్పారు.

అయితే అజ‌య్ దేవ‌గ‌ణ్ పాత్ర ఎలాంటిది? అన్న‌దానికి స‌రైన స్ప‌ష్ట‌త లేదు. అత‌డు విల‌న్ గా న‌టించ‌డం లేదు అన్న విష‌యంలో మాత్రం క్లారిటీనిచ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. దేవ‌గ‌ణ్ ఈ చిత్రంలో స్ఫూర్తివంత‌మైన విప్ల‌వ వీరుడిగా క‌నిపిస్తాడ‌ట‌. అత‌డి పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వ‌స్తుంది. ద్వితీయార్థం ప‌తాక స‌న్నివేశాల‌కు ముందు హై ఎమోష‌న‌ల్ రోల్ అత‌డిది అని తెలుస్తోంది. దాదాపు 30 నిమిషాల పాటు ఉత్కంఠ క‌లిగించే ఎమోష‌న‌ల్ యాక్ష‌న్ సీన్స్ తో అత‌డి పాత్ర‌ను అద్భుతంగా డిజైన్ చేశార‌ట‌. చ‌ర‌ణ్, తార‌క్ బ్రాండ్ వ్యాల్యూని బాలీవుడ్ లోనూ పెంచేందుకు జ‌క్క‌న్న వేసిన స్కెచ్ ఇద‌ని చెబుతున్నారు. దేవ‌గ‌న్ పాత్ర ఆ రెండు పాత్ర‌ల్ని ఎలివేట్ చేస్తుంద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. చివ‌రి 40 నిమిషాల స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల్ని భావోద్వేగాల‌కు గురి చేస్తాయ‌ట‌. దేవ‌గ‌ణ్ గ‌తంలో విప్ల‌వ వీరుడు భ‌గ‌త్ సింగ్ పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. ఇప్పుడు అదే పాత్ర‌ను ఆర్.ఆర్.ఆర్ లోనూ జ‌క్క‌న్న చూపిస్తున్నారా? అందుకే అజ‌య్ దేవ‌గ‌న్ ని ప్ర‌త్యేకంగా ఎంపిక చేసుకున్నారా? కొమ‌రం భీమ్, అల్లూరితో పాటు భ‌గ‌త్ సింగ్ పాత్ర‌ను హైలైట్ చేస్తూ జాతీయ స్థాయి గ్రిప్ సాధించే స్క్రీన్ ప్లే రాసుకున్నారా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ క‌థానాయిక ఆలియా భ‌ట్, హాలీవుడ్ గాళ్ డైజీ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 30 జూలై 2020న ఈ సినిమా రిలీజ‌వుతోంది.