ప‌ది భాష‌ల్లో RRR ప్రయోగం

RRR Biggest Update Tomorrow

ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఆర్.ఆర్.ఆర్ అన్ని సౌత్ భాష‌లు స‌హా హిందీలోనూ భారీగా రిలీజ్ కానుంది. 2020 జూలై 30 తేదీని ఇప్ప‌టికే లాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. 70శాతం చిత్రీక‌ర‌ణను పూర్తి చేసి ఫుల్ కాన్ఫిడెంటుగా బ‌రిలో దిగ‌నున్నారు. 30శాతం చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించిన ప్లానింగ్ అంతే ఇదిగా సాగుతోంద‌ట‌. ఈలోగానే ఇందులో తార‌క్ స‌ర‌స‌న నాయిక స‌హా లేడీ విల‌న్ డూడీ పేరును.. అలాగే ప్ర‌ధాన విల‌న్ పేరును చిత్ర‌బృందం నిన్న‌టి రోజున రిలీజ్ చేసింది.

దాదాపు ప‌ది భాష‌ల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నామ‌ని మీడియాకి వెల్ల‌డించారు. అంటే సౌత్ నాలుగు భాష‌లు స‌హా హిందీ క‌లుపుకుంటే ఐదు భాష‌లు. ఇత‌ర ఐదు భాష‌లు విదేశీ భాష‌లు అని అర్థ‌మ‌వుతోంది. జ‌పాన్ .. చైనా లాంటి చోట్లా మ‌న సినిమాల్ని భారీగా రిలీజ్ చేస్తున్నారు.  ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళికి బాహుబ‌లి ద‌ర్శ‌కుడిగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజు ఉంది కాబ‌ట్టి ఈసారి నాన్ ఇండియా కేట‌గిరీలో ఆర్.ఆర్.ఆర్ చిత్రాన్ని భారీగానే ప్లాన్ చేస్తున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.