RRR బ్యూటీ టైమ్స్ జాబితాలో నం.1

Last Updated on by

బాలీవుడ్ లో అత్యుత్త‌మ ప్ర‌తిభావ‌నిగా గుర్తింపు తెచ్చుకుని కెరీర్ ఆరంభించిన కేవ‌లం ఐదేళ్ల‌లోనే అగ్ర క‌థానాయిక‌గా స్టార్ డ‌మ్ ని అందుకుంది ఆలియా భ‌ట్. ద‌ర్శ‌క‌నిర్మాత‌ మ‌హేష్ భ‌ట్ వార‌సురాలిగా బ‌రిలో దిగిన ఈ అమ్మ‌డు వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇప్పుడున్న స్టార్ల‌లో దీపిక ప‌దుకొనే.. క‌త్రినను మించి ఈ అమ్మ‌డు యూత్ లో ఫాలోయింగ్ సంపాదించుకుంది అంటే అర్థం చేసుకోవ‌చ్చు. గ‌త ఏడాది ఆలియా టైటిల్ పాత్ర పోషించిన `రాజీ` సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఈ చిత్రంతో ఆలియా స్థాయి మ‌రో లెవ‌ల్ ని ట‌చ్ చేసింది.

తాజాగా టైమ్స్ మోస్ట్ డిసైరబుల్ విమెన్-2018 జాబితాలో నంబ‌ర్ 1 స్థానంలో నిలిచి మ‌రోమారు హాట్ టాపిక్ అయ్యింది. దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టైమ్స్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్ లో అగ్ర క‌థానాయిక‌ల్ని సైతం ఆలియా వెన‌క్కి నెట్టేసింది. గత సంవత్సరం 37 వ స్థానంలో నిలిచిన ఈ బ్యూటీ ఏకంగా ఇప్ప‌డు 36 స్థానాలు పైకి ఎగ‌బాకి నంబ‌ర్ వ‌న్ గా నిల‌వ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. దీపిక టైమ్స్ జాబితాలో టాప్ 2 పొజిష‌న్ నుంచి నాలుగో స్థానానికి దిగ‌జార‌గా.. క‌త్రిన మాత్రం ఒక స్థానం బెటర్ మెంట్ తో మూడో స్థానానికి ఎగ‌బాకింది. వీళ్లంద‌రినీ అధిగ‌మించి ఆలియా టాప్ -1 స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకుంది. యువ‌త‌రంలో అంత‌కంత‌కు ఫాలోయింగ్ పెంచుకుంటున్న నాయిక‌గా ఆలియాకు ఈ పొజిష‌న్ ని టైమ్స్ స‌ర్వే క‌ట్ట‌బెట్టింది. టాప్ 5 జాబితాలో మీనాక్షి చౌదరి టాప్ 2గా నిల‌వ‌గా.. గాయత్రీ భరద్వాజ్ టాప్ 5  స్థానం ద‌క్కించుకుంది. 2012లో క‌ర‌ణ్ జోహార్ నిర్మించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ చిత్రంతో క‌థానాయిక అయిన ఆలియా ప్ర‌స్తుతం వ‌రుస‌గా ప‌లు భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. బ్ర‌హ్మాస్త్ర‌.. సాధ‌క్ 2 అనే భారీ చిత్రాల్లో న‌టిస్తోంది. వీట‌న్నిటినీ మించి ఎస్.ఎస్.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలోని మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్.ఆర్.ఆర్ లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. అల్లూరి సీతారామ‌రాజు స‌ర‌స‌న సీత‌గా ఆలియా అభిన‌యించ‌నుంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీలో జ‌రుగుతోంది. ఆలియా ఇక్క‌డ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటోంద‌ని తెలుస్తోంది.


Related Posts