RRR బ‌డ్జెట్‌.. రిలీజ్ తేదీ వివ‌రం

Last Updated on by

ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్.ఆర్ తొలి మీడియా మీట్ లో ఎన్నో సందేహాల‌కు స‌మాధానం దొరికింది. ఇన్నాళ్లు తామ‌ర తంప‌ర‌గా మీడియాలో ప్ర‌చారం సాగుతున్న‌దేదీ నిజం కాద‌ని అర్థ‌మైంది. ప్రీఇండిపెండెన్స్ క‌థాంశం.. అలాగే ఒకే ఒక్క ఆలియా భ‌ట్ విష‌యంలో గెస్ త‌ప్ప మిగ‌తావ‌న్నీ అస‌త్యాలేన‌ని అర్థ‌మైంది. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ పోలీస్ గా న‌టించ‌లేదు. తార‌క్ ఒక దొంగ పాత్ర‌లోనూ న‌టించ‌లేదు. ఆ ఇద్ద‌రూ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులే. ఆ ఇద్ద‌రి పాత్ర‌లు స‌మానంగా ట్రావెల్ అయ్యేవే. అయితే 1920 నేప‌థ్య ంలో అప్ప‌టి వీరుల క‌థాంశంతో రూపొందుతున్న చిత్ర‌మిది. కొమ‌రం భీమ్ (ఎన్టీఆర్), అల్లూరి సీతారామ‌రాజు (చ‌ర‌ణ్‌) వీరులు కాక‌ముందు జీవితంపై సినిమా ఇది. దీనికి అంద‌మైన విజువ‌ల్ గ్రాఫిక్స్ ని, ఫిక్ష‌న్ క‌థ‌ను జోడించి తెర‌కెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమాకి దాన‌య్య ఎంత బడ్జెట్ పెడుతున్నారు? అంటే ఇంత‌కాలం 300 కోట్లు అంటూ ప్ర‌చార‌మైంది. అయితే నేటి ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు దాన‌య్య అస్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చారు. దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల మేర బ‌డ్జెట్ పెడుతున్నామ‌ని తెలిపారు. ఇక విజువ‌ల్ గ్రాఫిక్స్ భారీగా ఉంటాయ‌ని, నేచుర‌ల్ గా సినిమ‌ని చూపిస్తున్నామ‌ని రాజ‌మౌళి చెప్పిన దానిని బ‌ట్టి సినిమాలో బ్యూటీ కోసం చాలానే శ్ర‌మించ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని ఇద్ద‌రు వీరుల క‌థ‌ను తెలియ‌జెప్పాల‌న్న తాప‌త్ర‌య‌మే ఇద‌ని రాజ‌మౌళి తెలిపారు. 2020 జూలై 30న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నామ‌ని అధికారికంగా ప్ర‌క‌టించారు. మొత్తానికి హీరోల పాత్ర‌లు, బ‌డ్జెట్, రిలీజ్ తేదీ, క‌థానాయిక‌ల వివ‌రాలు అన్నీ బ‌య‌టికి వ‌చ్చేశాయి. ఇక పై మీడియా ఏం రాయోలో కూడా క్లారిటీ వ‌చ్చేసిన‌ట్టే.

Also Read: Keeravani’s Shocking Statement On RRR

User Comments