ఆర్‌రెరెర్రే…. ఆ సినిమా వాయిదా ప‌డిందా?

ఈ యేడాది అంద‌రూ తెలుగు సినిమావైపు చూస్తున్నారంటే కార‌ణం అదే. ఈ యేడాది రెండు ప్ర‌ముఖ కుటుంబాలకి చెందిన అభిమానులు ఆస‌క్తిగా ఒక సినిమా గురించే ఎదురు చూస్తున్నారంటే కార‌ణం అదే. ఆ సినిమా మ‌న దేశంలోనే అత్య‌ధిక బ‌డ్జెట్‌తో తెరకెక్కుతున్నద‌ని ట్రేడ్ వ‌ర్గాలు లెక్క‌గ‌డుతున్నాయి. ఆ సినిమానే వాయిదా ప‌డింద‌ని ప్ర‌చారం సాగుతుండ‌డం షాకింగ్‌గా మారింది. అక్టోబ‌ర్ 2020లో చిత్రాన్ని విడుదల చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

ఆ మేర‌కు ఆ చిత్ర‌బృందం త్వ‌ర‌లోనే ఓ ప్ర‌క‌ట‌న వెలువ‌రించే అవ‌కాశం ఉంది. ఇదివ‌ర‌కే ప్ర‌క‌టించిన విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డం, ఇప్ప‌టికి డెబ్బై శాతం మాత్ర‌మే చిత్రీక‌ర‌ణ పూర్తి కావ‌డం, ఇంకా బాలీవుడ్‌కి చెందిన ప‌లువురు ప్ర‌ముఖ న‌టులు సినిమాలో న‌టించాల్సి ఉండ‌టం… మ‌రోప‌క్క విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌నులు నిదానంగా సాగుతుండ‌డంతో విడుద‌ల తేదీని మార్చుకోవ‌డ‌మే మేల‌ని చిత్ర‌బృందం భావించింద‌ట‌. ఆ మేర‌కు ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యం తీసుకున్నార‌ని స‌మాచారం. రేపో మాపో ఆ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టే అవ‌కాశాలున్నాయి. ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత ఆ ద‌ర్శ‌కుడు తీస్తున్న సినిమా ఇదే. దాంతో ఆ చిత్రంపై ప‌లు అంచ‌నాలున్నాయి. ఇందులో హాలీవుడ్ న‌టులు కూడా న‌టిస్తున్నారు.