RRR టాప్ సీక్రెట్ లీక్‌

#RRR .. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో ట్రెండింగ్ న్యూస్ ఇది. ఈ ట్యాగ్‌లైన్‌తో ఏ స‌మాచారం వ‌చ్చినా యూత్ ఎంతో క్రేజీగా ప‌రిశీలిస్తున్నారు. రామ్‌చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ క‌ల‌యికను మెగా-నంద‌మూరి బాండింగ్‌గా చూస్తున్నారు ఫ్యాన్స్. చ‌ర‌ణ్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు క‌లిస్తే బాక్సాఫీసులు బ‌ద్ధ‌లైపోవాల్సిందేన‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అందుకే ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి దాదాపు 300 కోట్ల బ‌డ్జెట్ పెట్టేందుకైనా సిద్ధ‌మేన‌ని డివివి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది.

అయితే ఈ సినిమా ఇంత‌కీ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్న ప్ర‌శ్న‌కు అభిమానులకు స‌రైన క్లారిటీ లేనేలేదు. ఇంత‌వ‌ర‌కూ రాజ‌మౌళి కానీ ఇత‌ర‌త్రా బృందం కానీ అధికారికంగా ఏ వివ‌ర‌మూ ప్ర‌క‌టించ‌లేదు. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్‌లో ఈ సినిమాని ప్రారంభించాల‌ని ప్ర‌య‌త్నించినా.. ఇప్ప‌టికీ ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాలేద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ ప‌రిస‌రాల్లో భారీ సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సెట్స్‌లోనే జ‌క్క‌న్న కీల‌క షెడ్యూల్‌ని చిత్రీక‌రించ‌నున్నారు. సెప్టెంబ‌ర్ కాదు.. న‌వంబ‌ర్ అన్న‌ది మాత్రం ఇప్ప‌టికి సుస్పుష్టం. త‌దుప‌రి చిత్ర‌యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంటుంది.