డెహ్రాడూన్ లో ఆర్ ఆర్ ఆర్ స‌మ‌రం

Emma roberts for NTR in RRR

రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. గండిపేట లో నిర్మించిన బ్రిడ్జ్ సెట్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈనెలాఖ‌రుక‌ల్లా ఆ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. సినిమాలో ఆత్యంతం ఆస‌క్తిక‌రంగా ఆ స‌న్నివేశాలు క‌నిపించ‌నున్నాయ‌ని యూనిట్ చెబుతోంది. అంటే బ్రిటీష్ వాళ్ల‌పై రామ్, భీమ్ యుద్ద స‌న్నివేశాల‌ని తెలుస్తోంది. అనంత‌రం యూనిట్ హైద‌రాబాద్ నుంచి డెహ్రాడూన్ కి షిప్ట్ కానుంద‌ని తెలుస్తోంది. ఆగ‌స్టు నుంచి ఏక‌ధాటిగా కొన్ని రోజుల పాటు డెహ్రాడూన్ ప‌రిస‌రాల్లోనే షూటింగ్ జ‌ర‌గనుందిట‌.

దీనిలో భాగంగా షూటింగ్ కు అనుకూలంగా ఉండేలా కొన్ని చిన్న చిన్న సెట్స్ ను నిర్మిస్తున్నారుట‌. ఔట్ డోర్ షూట్ అనంత‌రం ఆ సెట్స్ లో కొన్ని స‌న్నివేశాలు షూట్ చేయ‌నున్నారుట‌. ఇప్ప‌టికే ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన టీమ్ డెహ్రాడూన్ చేరుకుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ లో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ కూడా పాల్గొంటాడుట‌. ఇక తార‌క్ కి జోడీగా హాలీవుడ్ న‌టి ఎమ్మా రాబ‌ర్స్ట్ ను ఎంపిక చేసిన‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. కానీ యూనిట్ ఇంకా ధృవీక‌రించ‌లేదు.

Also Read : RRR Intro Song The Biggest Ever?