బ‌ల్గేరియాలో రామ్-భీమ్ పోరాటం

రామ్ చ‌ర‌ణ్-ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఆర్ ఆర్ ఆర్ ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. హైద‌రాబాద్ లోనే ప్ర‌త్యేకంగా సెట్లు నిర్మించి షూటింగ్ చేసారు. తాజాగా యూనిట్ త్వ‌ర‌లో బ‌ల్గేరియాకు వెళ్ల‌బోతుంద‌ని స‌మాచారం. ప్రస్తుతం రాజ‌మౌళి ఆ ప‌నుల్లోనే బిజీగా ఉన్నాడ‌ని తెలిసింది. మూడు వారాల పాటు అక్క‌డ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్ ల‌పై స‌న్నివేశాల‌కు చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం.

గ‌తంలో రాజ‌మౌళి బ‌ల్గేరియాలోనే బాహుబ‌లి క్లైమాక్స్ యుద్ద స‌న్నివేశాల‌ను షూట్ చేసిన సంగ‌తి తెలిసిందే. సినిమాకే ఆ స‌న్నివేశాలు హైలైట్ గా నిలిచాయి. ఈ నేప‌థ్యంలో మ‌రోసారి బ‌ల్గేరియాలో రామ్-భీమ్ ల మ‌ధ్య వార్ ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో, ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని డి.వి.వి. దాన‌య్య భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జులై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.