RRRలో ఎన్ని పాట‌లో తెలుసా

Last Updated on by

రామ్ చ‌ర‌ణ్‌- ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఆర్. ఆర్. ఆర్ ఇప్ప‌టికే కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఇటీవ‌లే బ‌ల్గేరియాలో కీల‌క షెడ్యూల్ ను పూర్తిచేసారు. ప్ర‌స్తుతం టీమ్ త‌దుప‌రి షెడ్యూల్ కు రెడీ అవుతోంది. దీనిలో భాగంగా ఈషెడ్యూల్ హైద‌రాబాద్ లో జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది. ఈషెడ్యూల్ లో రామ్ చ‌ర‌ణ్ పై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించ‌నున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కూ షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఇది.

మ‌రి ఇద్ద‌రు యోధుల క‌థ‌లో పాట‌లున్నాయా? అంటే ఉన్నాయ‌నే తెలుస్తోంది. ఇందులో మొత్తం మూడు పాట‌లున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది. మ‌రో పాట బ్యాక్ గ్రౌండ్ లో రానుంద‌ని అంటున్నారు. మ‌రి ఆ పాటల్ని జ‌క్క‌న్న హీరోల‌ద్ద‌రికీ బ్యాలెన్స్ చేసాడా? లేక ఒక్క హీరోకే పాటేసుకునే అవ‌కాశం క‌ల్పించాడా? అన్న‌ది తేలాలి. రామ్ చ‌ర‌ణ్ కు ఫెయిర్ గా బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ ను ఎంపిక చేసారు. కానీ ఎన్టీఆర్ హీరోయిన్ పాత్ర విష‌యంలో ఇంకా క్లారిటీ లేదు. చ‌ర‌ణ్ కు కు సాంగేసుకునే అవకాశం ఉంద‌ని తెలుస్తోంది. విప్లవ యోధులు కొమ‌రంభీమ్- అల్లూరి సీతారామ రాజు పాత్ర‌లో తార‌క్-చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని డి. వి.వి దాన‌య్య ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.


Related Posts