RRR క‌థ‌: కొమ‌రం భీమ్‌+ అల్లూరి లాజిక్?

Last Updated on by

ఎస్.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వ ంలో ఆర్.ఆర్.ఆర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. మ‌రో భారీ షెడ్యూల్ ని తెర‌కెక్కిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి నేడు తెలుగు మీడియాకు వెల్లడించారు. హైద‌రాబాద్ పార్క్ హ‌య‌త్ లో జ‌రిగిన స‌మావేశంలో రాజ‌మౌళి మాట్లాడుతూ ప‌లు ఆస‌క్తిక‌ర సంగ‌తుల్ని రివీల్ చేశారు.

ముఖ్య ంగా ఈ సినిమాలో ఎన్టీఆర్, చ‌ర‌ణ్ పాత్ర‌ల‌పై స‌స్పెన్స్ లేకుండా క్లియ‌ర్ క‌ట్ గా ఆ పాత్ర‌లేంటి? అన్న‌దానిపైనా క్లారిటీ ఇచ్చేశారు. ఈ చిత్రం తెలంగాణ‌, ఆంధ్ర ప్రాంతాల్ని క‌లుపుకుని ఉండే క‌థాంశంతో తెర‌కెక్కుతోంది. స్వాతంత్య్రానికి పూర్వ ం అంటే.. 1920 నాటి కాల‌మాన ప‌రిస్థితుల్లో ఇద్ద‌రు వీరుల క‌థాంశం ఇద‌ని తెలిపారు. రాజ‌మౌళి ఇచ్చిన ఓ ఐడియాని విజ‌యేంద్ర ప్ర‌సాద్ అభివృద్ధి చేశారు. ఇందులో తెలంగాణ గిరిజ‌న వీరుడు కొమ‌రం భీమ్, ఆంధ్రా వీరుడు అల్లూరి సీతారామ‌రాజు క‌థ‌ను చూపిస్తున్నారు. అయితే ఆ ఇద్ద‌రూ వీరులై పాల‌కుల‌కు ఎదురెళ్లాక ఏం జ‌రిగింది? అన్న‌ది ఏమాత్రం ఈ చిత్రంలో చూపించ‌డం లేదు. ఆ ఇద్ద‌రూ వీరులు కాక‌ముందు క‌థేంటి? ఒక‌వేళ ఆ ఇద్ద‌రూ క‌లిసి ఉంటే నాడు భార‌త‌దేశం ఎలా ఉండేది? అన్న కోణంలో ఈ సినిమా క‌థ‌ను ఫిక్ష‌న‌ల్ గా రాజ‌మౌళి అండ్ టీమ్ రాసుకున్నార‌ట‌. ఇందులో కొమ‌రం భీమ్ పాత్ర‌లో నంద‌మూరి హీరో ఎన్టీఆర్ న‌టిస్తుంటే, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. ఒక‌వేళ కొమ‌రం భీమ్, అల్లూరి సీతారామ‌రాజు నాడు విడివిడిడిగా పోరాడ కుండా క‌లిసే పోరాటం చేసి ఉంటే ఎలా ఉండేది? అన్న ఫిక్ష‌న్ స్టోరీని త‌యారు చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంలో విజువ‌ల్ గ్రాఫిక్స్ కి ప్రాధాన్య‌త పెరిగింది. ఇక‌పోతే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ల‌ను ఎంపిక చేసుకోవ‌డానికి కార‌ణ‌మేంటి? అంటే కేవలం క‌థ, పాత్ర‌ల డిమాండ్ మేర‌కే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని రాజ‌మౌళి తెలిపారు.

User Comments