RRR టైటిల్ గ్రాంధికం.. ప్చ్‌!

RRR title revealed
 `బాహుబ‌లి` సిరీస్‌ త‌రవాత రాజ‌మౌళి ఎలాంటి సినిమాని తీస్తున్నారు? అంటూ దేశం మొత్తం ఆస‌క్తిగా ఎదురుచూస్తోంది. మ‌రోసారి రికార్డ్ బ్రేకింగ్ విజువ‌ల్ వండ‌ర్ ని అందించ‌బోతున్నారా? అంటూ ఆర్.ఆర్.ఆర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి ఆరాలు తీస్తూనే ఉన్నారు ఫ్యాన్స్. అంతగా జ‌క్క‌న్న పాపులారిటీ స్కైని ట‌చ్ చేసింది. త‌న పాపులారిటీకి త‌గ్గ‌ట్టే రామ్ చ‌ర‌ణ్ – ఎన్టీఆర్ ల క‌ల‌యిక‌లో `ఆర్ ఆర్ ఆర్‌` వ‌ర్కింగ్ టైటిల్ తో రాజ‌మౌళి భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా క‌థాంశం ఆస‌క్తిక‌రం. అల్లూరి సీతారామ‌రాజు.. కొమ‌రం భీం ఒకే స‌మ‌యంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. వెళ్లిన వాళ్లు ఎక్క‌డికి వెళ్లారు? ఏం చేశారు?. అసలు అల్లూరికి.. కొమ‌రం భీంకి ఎక్క‌డ ప‌రిచ‌యం ఏర్ప‌డింది? ఆ త‌రువాత వేరు వేరుగా ఎలా పోరాటం చేశారు? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థాంశానికి కాల్ప‌నికి అంశాన్ని జోడించి ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకొస్తుండ‌టంతో సినిమాపై స‌హ‌జంగానే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అయితే జాతీయ అంత‌ర్జాతీయ స్థాయి ప్రీబ‌జ్ తో వ‌స్తున్న ఈ సినిమాకి జ‌క్క‌న్న ఎలాంటి టైటిల్ ని ఎంపిక చేసుకున్నారు? అన్న ఆస‌క్తి అంద‌రిలో ఉంది. టైటిల్ పై కాంటెస్ట్ పెట్ట‌డంతో అంచ‌నాలు అంతే పెరిగాయి.
ఆ అంచ‌నాల‌కి విరుద్ధంగా చాలా సింపుల్‌గా ఈ చిత్ర టైటిల్ లోగోని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేశారు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ ద‌స‌రా కానుక అంటూ ఈ టైటిల్ వైర‌ల్ గా ప్ర‌చార‌మైంది. ముందు నుంచి చెబుతున్న‌ట్టే ఆర్ ఆర్ ఆర్ ని ప్ర‌తిబింబిస్తూ `రామ రౌద్ర రుషితం` అని టైటిల్ లోగోని రిలీజ్ చేశారు.  అయితే ఈ టైటిల్ ని ద‌ర్శ‌కుడు కాకుండా సినిమా పీఆర్ టీమ్ సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేయ‌డ‌మే ఇక్క‌డ పెద్ద ట్విస్ట్‌. భారీ బ‌డ్జెట్ సినిమా.. ఇద్ద‌రు స్టార్లు న‌టిస్తున్నారు. అలాంటి భారీ మ‌ల్టీ స్టార‌ర్ సినిమా టైటిల్ పోస్ట‌ర్ ని మ‌రీ ఇంత సింపుల్‌గా రిలీజ్ చేయ‌డ‌మే ఎవ‌రికీ అంతు ప‌ట్ట‌డం లేదు. ఏ విష‌యాన్నైనా సోష‌ల్ మీడియా ద్వ‌రా ప్ర‌క‌టించే రాజ‌మౌళి ఈ సినిమా టైటిల్ లోగో పోస్ట‌ర్ ని మాత్రం రిలీజ్ చేయ‌క ఆ ప‌నిని పీఆర్ టీమ్‌కు అప్ప‌గించారా? అన్న సందేహానికి తావిస్తోంది.
పైగా రాజ‌మౌళి సినిమా స్థాయిలో టైటిల్ ఫోర్స్ డ్ గా క‌నిపించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. టైటిల్ లో రామాయ‌ణ కాలం నాటి గ్రాంధిక భాష క‌నిపించింది. మ‌రీ ఇంత గ్రాంధికం ఎవ‌రికి అర్థ‌మ‌వుతుంది? రాజ‌మౌళి సినిమాల‌కు రిపీటెడ్ గా వ‌చ్చేదే మాస్ ఆడియ‌న్స్. వాళ్ల‌కు అర్థం కాని టైటిల్ ఇది. పైగా రామ రౌద్ర రుషితం అన్నారు. రామ అంటే అల్లూరి సీతారామ‌రాజు అని తెలుస్తోంది. కానీ కొమ‌రం భీం పేరు ప్ర‌స్తావ‌న టైటిల్ లో క‌నిపించ‌లేదు. రౌద్ర అంటే కొమ‌రం భీం అనుకోవాలా? అది అల్లూరికి కూడా సింబ‌లే క‌దా? ఇలాంటి ప్ర‌శ్న‌లు ఉద‌యించాయి. అయితే ఇది అధికారిక టైటిల్ కానేకాదు. కేవ‌లం ఫ్యాన్ మేడ్ టైటిల్ అని అర్థ‌మ‌వుతోంది. టైటిల్ విష‌యంలో జ‌క్క‌న్న మ‌రోసారి ఆలోచిస్తే మంచిదేమో అని సినీ జ‌నాలు అంటున్నారు. ఈ చిత్రాన్ని 2020 జూలై 30న విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేశారు.