టీజ‌ర్‌: రూల‌ర్ డ‌బుల్ ట్రీట్

న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ – కే.ఎస్.ర‌వికుమార్ క‌ల‌యిక‌లో సినిమా అన‌గానే మాస్ మ‌సాలా యాక్ష‌న్ చిత్రం అని అంతా అంచ‌నా వేశారు. తాజాగా ఈ సినిమా టీజ‌ర్ రిలీజైన సంగ‌తి తెలిసిందే. ఫ్యాన్స్ కి అదిరే ట్రీటిచ్చింది ఈ టీజ‌ర్. ధర్మ అనే పవర్ ఫుల్ కాప్ పాత్రలో బాలయ్య క‌నిపిస్తున్నారు. పోలీస్ అధికారిక‌గా ఆయ‌న విర‌విహారం చూడ‌బోతున్నామ‌ని అర్థ‌మైంది. అంతేకాదు స్మార్ట్ బిజినెస్‌మేన్ గెట‌ప్ ఆక‌ట్టుకుంది. ఆ రెండు విభిన్నమైన పాత్ర‌ల్లో బాలకృష్ణ ట్రీట్ ఖాయమైంది.

రూలర్ చిత్రంలో యాక్షన్ పాళ్ళు ఎక్కువే. గ‌తంలో వ‌చ్చిన సింహా- న‌ర‌సింహానాయుడు -జైసింహా వంటి చిత్రాల మాదిరిగానే ఉండ‌నుంది యాక్ష‌న్. ఇందులో వేదిక, సోనాల్ ల గ్లామర్, సప్తగిరి, ధన్ రాజ్ ల కామెడీ తో పూర్తి వినోదానికి ఆస్కారం క‌నిపిస్తోంది. ఇందులో సీనియ‌ర్ న‌టి భూమిక కీలక రోల్ చేస్తుండగా ప్రకాష్ రాజ్, జయసుధ, సాయాజీ షిండే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. డిసెంబ‌ర్ 20న క్రిస్మస్ కానుకగా రూలర్ విడుదలవుతోంది. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.