ప్రీరిలీజ్‌లో రూల‌ర్‌పైనే పంచ్‌లు

Ruler Pre-Release Event Live

రూల‌ర్ అంటూ అదిరిపోయే టైటిల్ పెట్టుకున్నారు. అయితే ఆ రూల‌ర్ పైనే పంచ్ లు వేశారు ప్రీరిలీజ్‌లో. అది కూడా యాంక‌ర్ ఉద‌య‌భాను ఎవ‌రూ ఊహించ‌ని పంచ్ ల‌తో అట్టుడికించింది. బాల‌య్య మాట్లాడితే కాల‌ర్ ట్యూన్ విన్న‌ట్టే అంటూ బోలెడ‌న్ని కామెడీలు చేసింది. ఇక ఇప్ప‌టికే బాల‌య్య ఏజ్ గురించి కూడా ప్ర‌స్థావిస్తూ ఆయ‌న ఏజ్ స‌గం అయిపోయింద‌ని వెన‌క్కి వెళ్లిపోతున్నార‌ని భాను తెగ అల్ల‌రి చేసేసింది.

అయితే అంతటి సీనియ‌ర్ యాంక‌ర్ బాల‌య్య‌పై వేసిన కుళ్లు జోకుల‌కు అభిమానుల్లో ఒక‌టే కంప‌రం పుట్టింది. అస‌లే బాల‌య్య తెలుగు భాష‌పై బ‌య‌ట ఒక‌టే కామెంట్లు వినిపిస్తుంటాయ్.. ఇటీవ‌ల ఆయ‌న ఏజ్ పైనా.. లుక్ పైనా సెటైర్లు ప‌డుతున్నాయ్. ఇలాంటి వేళ ఉద‌య‌భాను జోకుల‌న్నీ పూర్తిగా రివ‌ర్స్ లో పంచ్ వేసేశాయ్. మ‌రి వీట‌న్నిటినీ భ‌రిస్తూ రూల‌ర్ బాల‌య్య అక్క‌డ అచేత‌నుడైపోయాడు పాపం!! ఈ వేడుక‌లో కే.ఎస్.ర‌వికుమార్, సి.క‌ళ్యాణ్‌, చిరంత‌న్ భ‌ట్ త‌దిత‌రులు పాల్గొన్నారు.