ఎన్టీఆర్ 30… రూమర్స్కి చెక్ పెట్టాలనే?

సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి రేపు ఓ ప్రకటన వెలువడబోతోంది. అది కొంచెం సర్ప్రైజ్గా ఉండబోతోందట. ఆ సర్ప్రైజ్ ఏంటనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే ఇండస్ట్రీ వర్గాలు మాత్రం అది ఎన్టీఆర్ 30వ సినిమాకి సంబంధించిన ప్రకటనే అని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ట్విట్టర్లోనూ ఎన్టీఆర్ 30 అంటూ ట్రెండ్ అయ్యింది. ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ప్రకటనే అని సాగుతున్న ప్రచారంలో నిజం ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కొన్నాళ్లుగా ఎన్టీఆర్ సినిమా గురించి రకరకాల రూమర్స్ వస్తున్నాయి.

ఎన్టీఆర్తో సినిమా చేసే దర్శకుడు ఈయనే అంటూ పదుల సంఖ్యలో పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ రూమర్స్కి చెక్ పెట్టాలని ఎన్టీఆర్ అండ్ కో నిర్ణయించిందట. ఎన్టీఆర్ తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఉండబోతోందట. ఇప్పటికే ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా పూర్తయ్యాయి. అలాంటప్పుడు సినిమాని ప్రకటించడమే మేలని భావించారట. హారిక హాసిని, సితార సంస్థలు త్రివిక్రమ్ సొంత బ్యానర్లతో సమానం. రేపు ఎన్టీఆర్ – త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన ప్రకటన సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అధినేత సూర్యదేవర నాగవంశీ ట్విట్టర్ ద్వారా వెల్లడించబోతున్నట్టు సమాచారం.