వ‌ర్మ‌కి తాత‌గా ప్ర‌మోష‌న్‌

రామ్‌గోపాల్ వ‌ర్మ తాత అయ్యాడు. ఆయ‌న కూతురు రేవ‌తి ఆదివారం అమెరికాలో ఓ పాప‌కి జ‌న్మనిచ్చారు. డాక్ట‌ర్ అయిన రేవ‌తి 2013లో ప్ర‌ణ‌వ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల పెళ్లి హైద‌రాబాద్‌లోనే జ‌రిగింది. ప్ర‌ణ‌వ్ కూడా డాక్ట‌రే. పెళ్లి త‌ర్వాత ఈ జంట అమెరికాలో స్థిర‌ప‌డింది. అక్క‌డే రేవ‌తి పాప‌కి జ‌న్మనిచ్చారు. దాంతో వ‌ర్మ ఇంట ఆనందం వెల్లివిరిసిన‌ట్టైంది. తాత‌గా ప్ర‌మోష‌న్ అందుకున్న రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న మ‌న‌వ‌రాలి గురించి ఎలాంటి ముచ్చ‌ట్లు చెబుతాడో చూడాలి. వ‌ర్మ బంధాల‌కి పెద్దగా ప్రాధాన్య‌మివ్వ‌డు. భార్య ర‌త్న‌తో చాలా రోజుల కింద‌టే విడిపోయారు. కూతురుని కూడా ఆయ‌న త‌క్కువ‌గా క‌లుస్తుంటారు. కానీ ఆమెకి సంబంధించిన అన్ని విష‌యాల్నీ వ‌ర్మ‌నే చూసుకుంటుంటారు.