రెడ్ జీప్‌ని కొట్టేసిన కుర్ర‌డైరెక్ట‌ర్‌

Last Updated on by

కొత్త‌కుర్రాడు కార్తికేయ‌ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ ఆర్జీవీ అసిస్టెంట్ అజ‌య్ భూప‌తి `ఆర్ఎక్స్ 100` చిత్రం తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. పాయ‌ల్ రాజ్‌పుత్ ఈ చిత్రంతో క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది. ఇటీవ‌లే రిలీజై పాతిక రోజులు పైగా ఆడిందీ చిత్రం. పాయ‌ల్‌ పెద‌వి ముద్దులు, ఘాటైన స‌న్నివేశాల‌తో థియేట‌ర్ల‌లో ఆవిరులు పుట్టుకొచ్చాయి. ఆ ప్ర‌తిఫ‌లం బాక్సాఫీస్ వ‌ద్ద స్ప‌ష్ఠంగా క‌నిపించింది. ఆర్ఎక్స్ నిర్మాత గుమ్మ‌డికొండ అశోక్‌కి ఈ సినిమా పెద్ద రేంజులో వ‌ర్క‌వుటైంది. ఆర్ఎక్స్ 100 చిత్రాన్ని రిలీజ్ చేసిన పంపిణీదారులు లాభాలు క‌ళ్ల జూశారు. ఈ ఆనందోత్సాహంలోనే ఇటీవ‌ల 25రోజుల సెల‌బ్రేష‌న్స్‌ని టీమ్ ఘ‌నంగా నిర్వ‌హించింది.

అవ‌ధుల్లేని ఆనందంలో ఇప్పుడు నిర్మాత‌లు త‌న ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తికి అదిరిపోయే కానుక‌ను ఇచ్చారు. ఎరుపు రంగు జీప్ కార్‌ని కానుక‌గా ఇచ్చారు. ఆ ఫోటోల్ని టాలీవుడ్ టాప్ పీఆర్‌వో బిఏ రాజు అభిమానుల కోసం షేర్ చేశారు. కొర‌టాల శివ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, సుకుమార్, మారుతి లాంటి ద‌ర్శ‌కులు ఇటీవ‌ల త‌మ హీరోలు, ప్రొడ్యూస‌ర్ల నుంచి ఇటీవ‌ల ఖ‌రీదైన కార్‌ల‌ను కానుక‌లుగా అందుకున్నారు. ఇప్పుడు ఆ ఛాన్స్ ఆర్ఎక్స్ ద‌ర్శ‌కుడు అజ‌య్‌కి ద‌క్కింది. ఈ ప్రోత్సాహం అత‌డికి కెరీర్ ప‌రంగా మ‌రింత సాయ‌ప‌డుతుంద‌నే భావిద్దాం. ఇది బాధ్య‌త‌ను పెంచే బ‌రువు అని భావించి మ‌రిన్ని బ్లాక్‌బ‌స్ట‌ర్లు ఇస్తాడేమో చూడాలి.

User Comments