స్కైలో సాహో డిజిట‌ల్ హ‌క్కులు

ప్ర‌భాస్ నటిస్తున్న తాజా చిత్రం `సాహో`. శ్ర‌ద్దా క‌పూర్ క‌థానాయిక‌. సుజీత్ ద‌ర్శ‌కుడు. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ నెల 30న ప్ర‌పంచ‌వ్యాప్తంగా అత్యంత క్రేజీగా రిలీజ‌వుతోంది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ టీమ్ అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లోనూ ప‌ర్య‌టిస్తూ ప్ర‌చారం వేడెక్కిస్తున్నారు. ట్రైల‌ర్ ఇటీవ‌లే రిలీజై కోట్లాది వ్యూస్ తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. అందుకు త‌గ్గట్టే ప్రీబిజినెస్ అద‌ర‌గొడుతోంది. ఈ చిత్రానికి ఇప్ప‌టికే 320 కోట్ల మేర బిజినెస్ సాగింద‌ని ప్ర‌చార‌మైంది.

లేటెస్టుగా డిజిట‌ల్ రిలీజ్ హ‌క్కుల్ని అమెజాన్ ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం వెర్ష‌న్ల‌కు స‌ద‌రు సంస్థ 42కోట్లు చెల్లించ‌నుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ ఓ తెలుగు సినిమాకి ఇదే అత్యధిక ధ‌ర అని తెలుస్తోంది. 2019లో ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజైన అన్ని చిత్రాల రికార్డుల్ని సాహో బ్రేక్ చేస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కేవ‌లం హిందీ ప‌రిశ్ర‌మ‌లోనే ఓపెనింగ్ డే 50 కోట్ల షేర్ వ‌సూలు చేయ‌నుంద‌ని వి.వి.వినాయ‌క్ ప్రీరిలీజ్ వేదిక‌పై వెల్ల‌డించారంటే ఏ స్థాయిలో ఊపు ఊప‌బోతోందో అర్థం చేసుకోవ‌చ్చు. ఇక హిందీలో టీసిరీస్ సంస్థ రిలీజ్ చేస్తోంది. దాదాపు 80-90 కోట్ల మేర హిందీ రైట్స్ కి చెల్లించార‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి.