సాహోకి సెన్సార్ చిక్కులు

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సాహో ఈనెల 30న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. ఇటీవ‌లే సెన్సార్ ప‌నులు కూడా పూర్త‌య్యాయి. కానీ బోర్డ్ ఇంకా స‌ర్టిఫికెట్ జారీ చేయ‌లేదు. దీని వెనుక‌గ కార‌ణాలు ఏంట‌న్న‌వి తాజాగా బ‌య‌ట ప‌డ్డాయి. సెన్సార్ కి-సాహో బృందానికి మ‌ధ్య పొత్తు కుద‌ర‌కే స‌ర్టిఫికెట్ ను సెన్సార్ పెండింగ్ లోపెట్టిన‌ట్లు స‌మాచారం. సినిమాలో వ‌యోలెన్స్ ఎక్కువ‌గా ఉండ‌టంతో సెన్సార్ `ఏ` స‌ర్టిఫికెట్ జారీ చేసిందిట‌.

కానీ ఏ వ‌స్తే సినిమాలో చాలా క‌ట్లు ప‌డుతాయి. డైలాగుల ప‌రంగా మ్యూట్ త‌ప్ప‌దు. అందుకే యు / ఏ ఇవ్వాల్సిందిగా కోరారుట‌. చివ‌రికి కొన్ని ప‌రిమిత క‌ట్ల‌తో కూడాని యు ఏ ఇవ్వ‌డానికి బోర్డు అంగీక‌రించిన‌ట్లు తెలుస్తోంది. అయినా సాహో టీమ్ అంస‌తృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. దీంతో సెన్సార్- సాహా టీమ్ మ‌ధ్య ఇంకా పొత్తు కుద‌ర‌లేద‌ని తెలుస్తోంది. మ‌రి సెన్సార్ నిర్ణ‌య‌మే నెగ్గుతుందా? మేక‌ర్స్ రీజ‌న‌ల్ సెన్సార్ వ‌ర‌కూ వెళ్తారా? అన్న‌ది చూడాలి.