సాహోరే.. ఏమి ఆ బ‌డ్జెట్..?

Last Updated on by

బాహుబ‌లి తెలుగు ఇండ‌స్ట్రీకి మంచి చేసిందో.. చెడు చేసిందో ఇప్ప‌టికీ అర్థం కావ‌డం లేదు. మార్కెట్ పెరిగింద‌ని సంతోష‌ప‌డాలో.. దాన్ని చూసి మిగిలిన వాళ్లు కూడా భారీ బ‌డ్జెట్ పెట్టి చేతులు కాల్చుకుంటున్నార‌ని బాధ ప‌డాలో తెలియ‌ని ప‌రిస్థితి. ఇప్పుడు సాహోకు కూడా ఆకాశ‌మంత బ‌డ్జెట్ పెట్టేస్తున్నారు. ఈ చిత్రానికి 200 కోట్ల బ‌డ్జెట్ కేటాయిస్తే.. అందులో కేవ‌లం దుబాయ్ షెడ్యూల్ కోస‌మే 90 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అక్క‌డ అబుదాబిలో యాక్ష‌న్ సీక్వెన్సుల‌తో ర‌చ్చ చేస్తున్నారు సాహో టీం. ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క టైగ‌ర్ జిందా హై మాత్ర‌మే దుబాయ్ లో లాంగ్ షెడ్యూల్ చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డ్ సాహోకు కూడా వ‌చ్చేసింది. 50 రోజుల పాటే అక్క‌డే షూటింగ్ చేయ‌నున్నారు సాహో టీం.

ఈ క్ర‌మంలోనే కారులు.. బ‌స్సులు.. బైకులు.. ఇలా చాలా వాడేస్తున్నారు యాక్ష‌న్ సీక్వెన్సుల కోసం. అంతేకాదు.. రోజుకు 250 మంది క్ర్యూతో పాటు హై టెక్నిక‌ల్ టీం దీని కోసం ప‌ని చేస్తున్నారు. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్ర‌ఫ‌ర్ కెన్నీబేట్స్ సాహో కోసం యాక్ష‌న్ సీక్వెన్సులు ప్లాన్ చేస్తున్నాడు. దుబాయ్ షెడ్యూల్ కోసం ఇంత‌గా ఖ‌ర్చు చేయ‌డానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. అక్క‌డ షూటింగ్ చేస్తే.. దుబాయ్ టూరిజం రూల్స్ ప్ర‌కారం 30 శాతం వెన‌క్కి ఇస్తారు. అంటే 90 కోట్ల‌లో 65 కోట్లు పెడితే చాలు.. మిగిలిన అమౌంట్ రాయితీ అన్న‌మాట‌. మొత్తానికి ఇండియాలోనే బెస్ట్ యాక్ష‌న్ సినిమాగా సాహోను తీర్చిదిద్దే ప‌నిలో బిజీగా ఉన్నాడు సుజీత్.

User Comments