ఆమెరికాలో సాహో నెంబ‌ర్ 6

అమెరికాలో సాహో ప‌రిస్థితి ఏంటి? అంటే రిపోర్ట్ నెగిటివ్ గానే ఉంది. ఈ సినిమా అమెరికా లో ప్రీమియ‌ర్ షో స్ ద్వారా 9, 15,224 డాల‌ర్లు వ‌సూళ్లు తెచ్చిన‌ట్లే ట్రేడ్ లెక్క‌లు చెబుతున్నాయి. కానీ డిస్ట్రిబ్యూట‌ర్లు భారీ ధ‌ర‌కు రైట్స్ ద‌క్కించుకోవ‌డంతోనే చిక్కంతా వ‌చ్చి ప‌డింది. సినిమా ప్లాప్ టాక్ తో నిండా మునిగిపోయారు. దీంతో న‌ష్టాలు త‌ప్ప రూపాయి లాభం వ‌చ్చే ప‌రిస్థితి లేదు. ఇక తెలుగు రాష్ర్ట‌ల్లో అంత‌కంత‌కు ఘోరంగా ఉంది.

అమెరికాలో ప్రీమియ‌ర్ వ‌సూళ్ల ప‌రంగా సాహో స్థానం 6 అని తేలింది. గ‌తంలో బాహుబ‌లి -2, 24 మిలియ‌న్ డాల‌ర్లు, అజ్ఞాత‌వాసి 1.52 మిలియ‌న్ డాల‌ర్లు, బాహుబ‌లి ది బిగినింగ్ 1.39 మిలియ న్ డాల‌ర్లు , ఖైదీ నంబ‌ర్ 150 , 1.29 మిలియ‌న్ డాల‌ర్లు, స్పైడ‌ర్ 1.00 మిలియ‌న్ డాల‌ర్ల‌తో మొద‌టి ఐదు స్థానాలో నిల‌వ‌గా సాహో మాత్రం 915 వేల డాల‌ర్ల‌తో ఆరో స్థానంలో నిలిచింది. దీని త‌ర్వాత భ‌ర‌త్ అనే నేను 850 వేల డాల‌ర్లు, అర‌వింద స‌మేత వీరరాఘ‌వ 789 వేల డాల‌ర్లు, రంగ‌స్థంలో 725 వేల డాల‌ర్లు, స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ 616 వేల డాల‌ర్ల తో త‌ర్వాతి ఐదు స్థానాల్లో నిలించాయి.