`ట్రాన్స్‌ఫార్మ‌ర్స్` వ‌ర్సెస్ `సాహో`?

Last Updated on by

రోడ్‌పై స‌ర్రున దూసుకుపోయే ట్ర‌క్ ఉన్న‌ట్టుండి మ్యాన్‌-రోబోట్‌గా రూపం మార్చుకుంటుంది. శ‌త్రువుతో భీక‌రంగా త‌ల‌ప‌డుతుంది. మెషీన్ గ‌న్స్ .. స్టెన్ గ‌న్స్ ఫైరింగ్‌ .. రోబో వ‌ర్సెస్ రోబో భీతావ‌హ యుద్ధంతో ఆ ప్రాంతం ద‌ద్ద‌రిల్లిపోతుంది. ఖ‌రీదైన న‌గ‌రంలో ప్లైఓవ‌ర్‌పై భారీ ఛేజ్‌లు, భీభ‌త్సం ఒక‌టేమిటి .. ఆ విజువ‌ల్స్ చూసేందుకు రెండు క‌ళ్లు చాల‌వు. `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ -5` ప్ర‌సాద్ ల్యాబ్స్ ప్రివ్యూలో ప్ర‌తి ఫైట్ సీక్వెన్సుకి బాల‌య్య సినిమాకి వేసినట్టు జ‌నం విజిల్స్ వేశారంటే ఆ సినిమా ఏ రేంజులో మ‌న తెలుగువారికి ఎక్కిందో అర్థం చేసుకోవాలి.

ఇప్పుడు అంతకు మించి ప్ర‌భాస్ `సాహో` యాక్ష‌న్ సీన్స్‌కి విజిల్స్, కేక‌లు త‌ప్ప‌వ‌ని అర్థ‌మ‌వుతోంది. `ట్రాన్స్‌ఫార్మ‌ర్స్‌` ఫేం కెన్నీ బేట్స్ ఈ సినిమాకి ఆ రేంజులో యాక్ష‌న్‌ని డిజైన్ చేశారు. ప్ర‌స్తుతం దుబాయ్‌లో సుదీర్ఘ‌మైన షెడ్యూల్ చిత్రీక‌రిస్తున్నారు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం ఓ భారీ యాక్ష‌న్ సీక్వెన్సుని దుబాయ్‌లోని కాస్ట్‌లీ ఫ్లైవోవ‌ర్‌పై తెర‌కెక్కిస్తున్నారు. ఈ ఫైట్‌లో అత్యంత ఖ‌రీదైన స్పోర్ట్స్ బైక్స్‌, అంత‌కుమించి కాస్ట్‌లీ ల‌గ్జ‌రీ కార్లు, హిటాచీ ట్ర‌క్స్‌, కాట‌ర్‌పిల్ల‌ర్ ట్రక్స్‌తో భారీ ఛేజ్ చిత్రీక‌రిస్తున్నార‌ట‌. ఇక ఫ్లైఓవ‌ర్‌పై నుంచి ట్ర‌క్ కిందికి ప‌డిపోయే స‌న్నివేశంలో అందులోంచి ప్ర‌భాస్ అసాధార‌ణంగా గాల్లోకి జంప్ చేస్తార‌ట‌. ప్ర‌భాస్ కెరీర్‌లోనే అత్యంత రిస్కా షాట్ ఇద‌ని,ఈ జంప్ సీన్ సినిమాకే హైలైట్‌గా ఉంటుంద‌ని చెబుతున్నారు. ఇలాంటి భారీ రిస్కీ షాట్స్ కెన్నీ బేట్స్‌ చిత్రీక‌రిస్తున్నారు కాబ‌ట్టి షూటింగ్ నెమ్మ‌దిగా సాగుతోందిట‌. ఆ క్ర‌మంలోనే ఈ సినిమా షెడ్యూల్‌ని పొడిగించార‌ని తెలుస్తోంది. జూన్ వ‌ర‌కూ దుబాయ్‌లోనే చిత్రీక‌ర‌ణ సాగుతుందిట‌. షెడ్యూల్ మొత్తం పూర్తి చేసుకుని, జూన్‌లోనే సాహో టీమ్ హైద‌రాబాద్‌కు తిరిగి వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక సాహో బ‌డ్జెట్ ప‌రంగానూ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇప్ప‌టికి 300 కోట్ల బ‌డ్జెట్‌ని ప్ర‌తిపాదించార‌ని స‌మాచారం లీకైంది.

User Comments