సాహో వ‌ర్సెస్ థ‌గ్స్

Last Updated on by

ప్ర‌స్తుతం అర‌డ‌జ‌ను సినిమాల గురించి దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. వీటిలో సైరా – న‌ర‌సింహారెడ్డి, సాహో, థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్ సినిమాలు చెప్పుకోద‌గ్గ‌వి. అన్ లిమిటెడ్ బ‌డ్జెట్ మూవీ మెగాస్టార్ `సైరా` హైద‌రాబాద్‌లో కీల‌క షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. ఇక‌పోతే దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న `సాహో`, 200కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` చిత్రాలు అంతే క్రేజీగా తెర‌కెక్కుతున్నాయి. స‌రిగ్గా ఈ టైమ్‌లో ఒక కంపారిజ‌న్ ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ మూడు సినిమాల‌కు భారీ సెట్స్‌ని నిర్మించి భారీ యాక్ష‌న్ దృశ్యాల్ని తెర‌కెక్కిస్తున్నారు. ఔట్‌డోర్ షూటింగుల కోసం భారీ మొత్తాల్ని ఖ‌ర్చు చేస్తున్నారు.

దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న `సాహో` చిత్రీక‌ర‌ణ మెజారిటీ పార్ట్ యాక్ష‌న్ దృశ్యాల్ని దుబాయ్‌, గ‌ల్ఫ్ దేశాల్లో చిత్రీక‌రించారు. అక్క‌డ ఏకంగా 60రోజుల పాటు తిష్ఠ‌వేసి 100కోట్ల బ‌డ్జెట్‌తో సాహ‌సోపేత‌మైన భారీ యాక్ష‌న్ దృశ్యాల్ని తెర‌కెక్కించారు. దుబాయ్‌లో సుదీర్ఘ‌కాలం తెర‌కెక్కిన‌ ఇండియన్ సినిమాగా సాహో రికార్డుల‌కెక్కింది. ఇప్పుడు అమీర్‌ఖాన్‌, అమితాబ్‌ల క్రేజీ ప్రాజెక్ట్ `థ‌గ్స్ ఆఫ్ హిందూస్తాన్‌` అదే తీరుగా యూర‌ప్‌- మాల్టాలో ఏకంగా 45 రోజుల షెడ్యూల్ జ‌రుపుకుంది. ఇందుకోసం 80 కోట్లు పైగా బ‌డ్జెట్‌ని మంచినీళ్ల ప్రాయంగా ఖ‌ర్చు చేశార‌ట‌. ఈ విష‌యాన్ని టీమ్ ప్ర‌క‌టించింది. ఈ ఏడాది దీపావ‌ళి కానుక‌గా `థ‌గ్స్ ఆప్ హిందూస్తాన్‌` రిలీజ‌వుతోంది. సాహో వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్‌లో రిలీజ్ కానుంది. సైరా ఇంచుమించు అప్పుడే రిలీజ‌వుతుంద‌ని చెబుతున్నారు.

User Comments