ప్రభాస్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు

Last Updated on by

ఒక మిలియ‌న్ వ్యూస్ వ‌స్తేనే.. మా పాట‌కు అన్ని వ్యూస్ వ‌చ్చాయి.. ఇన్ని వ్యూస్ వ‌చ్చాయి అని చెప్పుకుంటున్నారు మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు. కానీ ఇక్క‌డ ఓ పాట‌కు ఏకంగా 100 మిలియ‌న్ వ‌చ్చాయి. అదే సాహోరే బాహుబ‌లి. భ‌ళిభ‌ళి రా అంటూ సాగే ఈ పాట బాహుబ‌లి 2 హైలైట్ గా నిలిచింది. ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వ‌ర‌కు అందరూ ఈ పాట‌కు ఫిదా అయిపోయారు. దీనికి ఫ‌లిత‌మే ఇప్పుడు సాహోరే బాహుబ‌లి వీడియో సాంగ్ కు 100 మిలియ‌న్ వ్యూస్.. అంటే 10 కోట్ల మంది ఈ పాట‌ను చూసార‌న్న‌మాట‌. ఆగ‌స్ట్ లో విడుద‌లైన ఈ పాట‌కు అప్ప‌ట్నుంచీ ఇప్పటి వ‌ర‌కు క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు.Saahore Baahubali Song Record Views on YouTubeసాధార‌ణంగా పాట‌ల‌ను 1080 రెసొల్యూషన్ లో విడుద‌ల చేస్తారు ద‌ర్శ‌కులు. కానీ సాహోరే బాహుబ‌లి మాత్రం నార్మ‌ల్ వీడియో సాంగ్ కాదు.. 4కే డిజిటల్ ఆల్ట్రా సౌండ్ వీడియో సాంగ్. ఇండియాలో ఇలాంటి క్వాలిటీతో విడుద‌లైన తొలి వీడియో సాంగ్ ఇదే. భ‌ళిభ‌ళిరా భ‌ళి అంటూ ప్ర‌భాస్ ఒక్క‌సారిగా అలా ఏనుగు పైకి ఎక్కుతుంటే ఆ వీడియో చూసి అభిమానులు ఫిదా అయిపోయారు. గ‌త ఎనిమిది నెల‌లుగా యూ ట్యూబ్ ను ఈ పాట షేక్ చేస్తూనే ఉంది. మొత్తానికి సాహోరే బాహుబ‌లి అన్న లిరిక్స్ కు పూర్తి న్యాయం చేసింది ఈ పాట‌.

User Comments