సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న రేర్ రికార్డ్

Allu arjun and Pooja Hedge(Image Source : Google)

అల్లు అర్జున్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో అల వైకుంఠ‌పుర‌ములో శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా నుంచి ఇటీవ‌ల రిలీజైన `సామజ‌వ‌ర‌గ‌మ‌న‌..` అరుదైన రికార్డును అందుకుంది. ఈ లిరిక‌ల్ వీడియో 100 మిలియ‌న్ వ్యూస్ (10 కోట్ల) క్ల‌బ్ లో చేరింది.

ఇటీవ‌లి కాలంలో సంగీతం ప‌రంగా ర‌క‌ర‌కాల విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్న థ‌మ‌న్ ఈ లిరిక‌ల్ పాట‌తో కంబ్యాక్ అయిన‌ట్టే. థ‌మ‌న్ కెరీర్ బెస్ట్ ట్యూన్ ఇదే. సిధ్ శ్రీ‌రామ్ ఈ పాట‌ను అల‌పించాడు. ఇక‌పైనా మ‌రిన్ని లిరిక‌ల్ పాట‌లు.. వీడియోల‌తో అల టీమ్ దుమారం రేప‌నుంది. డిసెంబ‌ర్ 2న ఓ స్పెష‌ల్ టీజ‌ర్ ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండ‌గా..  పోటీ బ‌రిలో ప‌లు చిత్రాల టీజ‌ర్లు రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అదే రోజు మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు కొత్త టీజ‌ర్ ని రిలీజ్ చేయ‌నున్నారు. వీటితో పాటే డిస్కో రాజా .. ప్ర‌తి రోజు పండ‌గే టీజ‌ర్ల‌ను ఆ వారంలో రిలీజ్ చేస్తున్నారు.