చియాన్ సైర‌న్ మోత‌

Last Updated on by

త‌మిళ హీరోల్లో ర‌జ‌నీకాంత్, క‌మల్‌హాస‌న్‌, అజిత్, విజ‌య్‌ త‌ర్వాత అంత క్రేజు ఉన్న హీరో చియాన్ విక్ర‌మ్‌. `గ‌జిని` సూర్య‌కు స‌మ‌కాలికుడుగా అత‌డు రాణించిన తీరు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఒక సాధాసీదా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వ‌చ్చిన విక్ర‌మ్ ఇంతింతై అన్న చందంగా ఎదిగాడు. త‌న‌ని తాను బాక్సాఫీస్ చియాన్‌గా మ‌లుచుకున్న తీరు అన‌న్య సామాన్యం. అందుకే అత‌డు ఏ సినిమాలో న‌టిస్తున్నా దాని గురించి విస్త్ర‌తంగా జ‌నంలో చ‌ర్చ సాగుతుంది.

తాజాగా అత‌డు న‌టించిన `సామి స్క్వేర్‌` రిలీజ్ బ‌రిలోకి దిగుతోంది. నేటి సాయంత్రం దేవీశ్రీ సంగీతం అందించిన ఆడియో మార్కెట్లోకి రిలీజ్ కానుంది. రాక్ స్టార్ బాణీలు చియాన్‌కి అద‌న‌పు బ‌లం కానున్నాయి. ఇక‌పోతే ఈ చిత్రంలో విక్ర‌మ్ స‌ర‌స‌న కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టించింది. టాప్ క్యాస్టింగ్ విక్ర‌మ్‌తో పోటీప‌డి న‌టిస్తున్నారు. శంక‌ర్‌ `ఐ` సినిమా ప‌రాజ‌యం త‌ర్వాత మ‌రిన్ని అప‌జ‌యాలు విక్ర‌మ్‌ని బ్యాక్ బెంచీకి ప‌రిమితం చేశాయి. అయితే వీట‌న్నిటి నుంచి బ‌య‌ట‌ప‌డేలా సింగం హ‌రి అత‌డికి సామి స్క్వేర్ రూపంలో హిట్టిస్తాడ‌నే అంచ‌నా వేస్తున్నారు. చియాన్ సైర‌న్ మోత మోగింది. ఇక గెలుపు గుర్రం ఎక్క‌డ‌మే ఆల‌స్యం. ఆగ‌స్టులో `సామి స్క్వేర్` చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

User Comments