జ‌న‌సేన‌కు కోట్లు పెడ‌తాడ‌ట‌!

Last Updated on by

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీబ‌రిలో దిగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే జ‌న‌సేన‌ పార్టీ గెల‌వాలంటే పెట్టుబ‌డి కావాలి క‌దా? అది ఎవ‌రు స‌మ‌కూరుస్తున్నారు? ప‌వ‌న్ ఇప్ప‌టికే త‌న వ‌ద్ద ఎన్నిక‌ల్లో జ‌ల్లేసేందుకు స‌రిప‌డా డ‌బ్బు లేదని అన్నారు. మ‌రి ఆయ‌నకు ఎవ‌రు సాయం చేస్తున్నారు? అంటే.. ఎవ‌రి పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం లేదు. అప్ప‌ట్లో జ‌న‌సైనికులు పార్టీ ఫండ్ క‌లెక్ట్ చేస్తున్నారంటూ ఓ సామాజిక వ‌ర్గం మీడియా నానా హ‌డావుడి చేసింది. ప‌వ‌న్ ని బ‌ద‌నాం చేయ‌డ‌మే ధ్యేయంగా కంక‌ణం క‌ట్టుకుని దుష్ప్ర‌చారం చేసే ప్ర‌య‌త్నం చేశారు.

అదంతా అటుంచితే .. జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి ముంబై వాలా.. ఒరేయ్ పండు స‌చిన్ జోషి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ గెలుస్తుంది. వైసీపీ, తేదేపా రెండిటికి అవ‌కాశం లేదు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ముఖ్య మంత్రి అవుతారు అంటూ జోస్యం చెప్పాడు. జ‌న‌సేన పార్టీకి ఏదైనా సాయం చేస్తున్నారా? అంటే త‌ను అడ‌గాలే కానీ, ఎంత‌యినా ఏదైనా సాయం చేస్తాన‌ని స‌చిన్ జోషి వ్యాఖ్యానించ‌డం ఆస‌క్తి రేకెత్తించింది. ఓ మీడియా హౌస్ తో ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ స‌చిన్ త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టారు. ఇక‌పోతే స‌చిన్ జోషి న‌టించిన అమావాస్య చిత్రం ఈ నెల 8న తెలుగు, హిందీ వెర్ష‌న్ల‌లో రిలీజ‌వుతోంది. ముంబైలో భారీ వ్యాపారాలు క‌లిగి ఉన్న స‌చిన్ జోషి ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. స‌చిన్ జోషి లాంటి కొంద‌రు ప‌వ‌న్ వెంట ఉంటే ప‌వ‌న్ గెలిచే ఛాన్స్ లేక‌పోలేదు.

User Comments