సాహో 2019 ఆగ‌స్టులో?

Last Updated on by

ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో `సాహో` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. యు.వి.క్రియేష‌న్స్ సంస్థ దాదాపు 300కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తోంది. శంక‌ర్‌- ఎహ‌సాన్‌-లాయ్ త్ర‌యం ఈ చిత్రానికి సంగీతం అందిస్తోంది. ప్ర‌భాస్ స‌ర‌స‌న `ఆషికి- 2` ఫేం శ్ర‌ద్ధాక‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. `బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత ప్ర‌భాస్ న‌టిస్తున్న అసాధార‌ణ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇద‌ని చెబుతున్నారు.

ఇక‌పోతే ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అన్న‌దానిపై ఇప్ప‌టికి స‌రైన ఆన్స‌ర్ లేదు. ఇప్పుడు అప్పుడు అంటూ మీడియా ఊహాగానాలు త‌ప్ప అధికారిక ప్ర‌క‌ట‌న ఏదీ రాలేదు. అయితే యువిక్రియేష‌న్స్‌కి చెందిన ఓ క్లోజ్ సోర్సెస్ ప్ర‌కారం.. ఈ చిత్రాన్ని 2019 ఆగ‌స్టులో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. 2019 ఇండిపెండెన్స్ డే కానుక‌గా రిలీజ్ చేస్తే అది త‌మ చిత్రానికి క‌లిసొస్తుంద‌ని యోచిస్తున్నార‌ట‌. భారీ గ్రాఫిక్స్, విజువ‌ల్ ఎఫెక్ట్స్‌తో ముడిపడిన అంశం కాబ‌ట్టి ఇంకో ఏడాది పాటు సుదీర్ఘంగా వేచి చూడాల్సిందేన‌ని చెబుతున్నారు. అంటే ఇంకో 12నెల‌ల త‌ర్వాత సాహో రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతుంద‌న్న‌మాట‌! ఇటీవ‌లే గ‌ల్ఫ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైద‌రాబాద్‌లో అడుగుపెట్టిన టీమ్ ఇక్క‌డ ఓ సెట్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తోంద‌ని స‌మాచారం. బాహుబ‌లి చిత్రాన్ని ఎంత‌మంది చూశారో, అంత‌మంది ఆద‌రించాల‌న్న వ్యూహంతో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది.

User Comments