సాహో: ప్ర‌భాస్ న్యూ షాకింగ్ లుక్

డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ సాహో. దాదాపు 300కోట్ల బ‌డ్జెట్ తో యువి క్రియేష‌న్స్ సంస్థ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోంది. సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ రివీలైన ప్ర‌తి లుక్ కి ప్ర‌భాస్ అభిమానులు స‌హా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీప్రియుల నుంచి అద్భుత స్పంద‌న వ‌చ్చింది. షేడ్స్ ఆఫ్ సాహో చాప్ట‌ర్ 1.. చాప్ట‌ర్ 2 రెండు వీడియోల్ని కోట్లాది మంది యూట్యూబ్ లో వీక్షించారు. స‌ల్మాన్ .. అమీర్ ఖాన్ రేంజులో ప్ర‌భాస్ కి ఫాలోయింగ్ క‌నిపించింది. అందుకే సాహో చిత్రాన్ని 2019 మోస్ట్ అవైటెడ్ సినిమాగా అభిమానులు భావిస్తున్నారు. ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలో నెవ్వ‌ర్ బిఫోర్ అన్న రేంజులో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ చిత్రాన్ని సుజీత్ అండ్ టీమ్ తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా చిత్ర‌యూనిట్ కొత్త లుక్ ని రిలీజ్ చేసింది.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా సాహో 15 ఆగ‌స్టు రోజున థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. మాతో చేతులు కలిపండి అంటూ యువి క్రియేష‌న్స్ సంస్థ అధికారికంగా సోష‌ల్ మీడియాలో ఈ లుక్ ని రివీల్ చేసింది. ఈ కొత్త పోస్ట‌ర్ ఇలా వ‌చ్చిందో లేదో అలా అంత‌ర్జాలంలోకి దూసుకుపోయింది. అభిమానులు వేగంగా దీనిని షేర్ చేస్తున్నారు. ఇక ఈ పోస్ట‌ర్ లో ప్ర‌భాస్ లుక్ లో బోలెడంత స‌స్పెన్స్ దాగి ఉంది. అత‌డు ఈ చిత్రంలో పోలీసాఫాస‌ర్ గా న‌టిస్తున్నార‌ని.. సీక్రెట్ ఏజెంట్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ని లేదు గ‌జ‌దొంగ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నార‌ని ర‌క‌ర‌కాల స్పెక్యులేష‌న్స్ ఇప్ప‌టికే వేడెక్కించాయి. మేకింగ్ వీడియోల్లోనూ అత‌డి పాత్ర ఏంటి? అన్న‌ది రివీల్ చేయ‌లేదు. అప్ప‌టికీ స‌స్పెన్స్ లోనే ఉంచ‌డంతో అభిమానుల్లో క్యూరియాసిటీ అంత‌కంత‌కు పెరుగుతోంది. అన్నిటికీ తెర దించే రోజు 15 ఆగ‌స్టు. పోస్ట‌ర్ లోనే తేదీని ప్ర‌క‌టించారు కాబ‌ట్టి ఆరోజు క‌న్ఫామ్ గా రిలీజ‌వుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ సినిమాకి గ్రాఫిక్స్ స‌హా ఇత‌ర‌త్రా ప‌నుల్ని వేగంగా పూర్తి చేస్తున్నారు. మ‌దీ, సాబు సిరిల్, శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్, క‌మ‌ల్ క‌న్న‌న్ లాంటి టాప్ టెక్నీషియ‌న్లు ఈ చిత్రానికి ప‌ని చేస్తున్నారు.