`సాహో` ఓవ‌ర్సీస్ డీల్ ఎంతంటే?

Last Updated on by

బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత సాహో చిత్రంలో న‌టిస్తున్నాడు ప్ర‌భాస్. ఇటీవ‌లే షేడ్స్ ఆఫ్ సాహో మేకింగ్ చాప్ట‌ర్ 2 వీడియోని లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియో యూట్యూబ్ లో జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. ఇప్ప‌టికే 2కోట్ల మంది వీక్షించారు. మేకింగ్ వీడియో స్పీడ్ కి త‌గ్గ‌ట్టే ఇప్పుడు సాహో ప్రీరిలీజ్ బిజినెస్ లోనూ వేగం అందుకుంద‌ని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు స‌హా ఓవ‌ర్సీస్ డీల్ హై ఎండ్ లో సాగుతోందిట‌.

తాజా స‌మాచారం ప్ర‌కారం సాహో ఓవ‌ర్సీస్ డీల్ ఫిక్స‌య్యింద‌ని తెలుస్తోంది. దుబాయ్ కి చెందిన ప్ర‌ఖ్యాత ఫార్స్ ఫిలింస్ సంస్థ ఓవ‌ర్సీస్ హక్కుల్ని దాదాపు రూ.50కోట్ల (8కోట్లు రిక‌వ‌రీ)కు చేజిక్కించుకుంద‌ట‌. చైనా హ‌క్కులు మిన‌హాయించి ఇత‌ర దేశాల్లో ఈ సంస్థ సాహో చిత్రాన్ని రిలీజ్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని అమెరికాలో అత్యంత భారీగా రిలీజ్ చేసేందుకు స‌ద‌రు డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీ ప్లాన్ చేస్తోంద‌ట‌. `సాహో` చిత్రానికి ఓవ‌ర్సీస్ ప‌రంగా భారీ డీల్ అన్న మాటా వినిపిస్తోంది. యువి క్రియేష‌న్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో అత్యంత భారీగా రిలీజ్ చేయ‌నున్నారు. శంక‌ర్ – ఎహ‌సాన్- లాయ్ సంగీతం అందిస్తున్నారు. వంశీ, ప్ర‌మోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌భాస్ స‌ర‌స‌న శ్ర‌ద్ధా క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

User Comments