మెగా హీరోలు ర్యాంక్ కోసం పోటీ పడుతున్నారు

ఓ సినిమా చ‌రిత్ర‌లో నిలిచిపోయే విజ‌యం సాధించ‌డం క‌ష్టం కానీ.. చ‌రిత్ర‌లో నిలిచిపోయే ప‌రాజ‌యం పొందాలంటే మాత్రం చాలా ఈజీ. కానీ దానికి కూడా కొన్ని కార‌ణాలుండాలి. ఇప్పుడు ఇంటిలిజెంట్ కు అన్ని కార‌ణాలు ఉన్నాయి. అందుకే ఈ చిత్రం బ‌య్య‌ర్ల‌ను భ‌యంక‌రంగా ముంచేస్తుంది. ఇన్నాళ్లూ వినాయ‌క్ సినిమాలంటే కాస్తైనా న‌మ్మ‌కం ఉండేది.. సాయిధ‌రంతేజ్ అంటే ఏదో చేస్తాడు అనే కాన్ఫిడెన్స్ ఉండేది.. ఒక్క సినిమాతో ఈ రెండూ పోయాయి. ఇంటిలిజెంట్ కు వ‌చ్చిన వ‌సూళ్లు చూస్తుంటే సినిమా ఎంత పెద్ద డిజాస్ట‌రో మాట‌ల్లో కూడా చెప్ప‌లేం. ఎందుకంటే ఆ లెక్క‌లే చెబుతున్నాయి క‌దా. తొలి మూడు రోజుల్లో కేవ‌లం మూడంటే మూడు కోట్లు మాత్ర‌మే తీసుకొచ్చింది ఈ చిత్రం. ఇంక ఓవ‌ర్సీస్ లో అయితే సాయి సినిమా వైపు చూడ్డానికి కూడా భ‌య‌పడుతున్నారు అక్క‌డి ప్రేక్ష‌కులు.

ఓవ‌ర్సీస్ లో మూడు రోజుల్లో 28 ల‌క్ష‌లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఊరుపేరు తెలియ‌ని సినిమాలు కూడా ఇంత‌కంటే ఎక్కువ వ‌సూలు చేస్తాయి ఒక్కోసారి. కానీ సాయిధ‌రంతేజ్ లాంటి క్రేజీ హీరో.. వినాయ‌క్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ క‌లిసి కూడా అక్క‌డ ఇంత మాయ కూడా చేయ‌లేక‌పోయారు. అస‌లు కొత్త‌ద‌నం లేని క‌థ‌ను తీసుకొచ్చి.. దానికి మ‌రింత చెత్త స్క్రీన్ ప్లే యాడ్ చేసి ఏదో టైమ్ పాస్ చేసిన సినిమాలా తెర‌కెక్కించాడు వినాయ‌క్. త‌న బ్రాండ్ పోతుంద‌ని తెలిసి కూడా ఇంత ఎపిక్ డిజాస్ట‌ర్ ఇచ్చాడు. మ‌రోవైపు సాయి ధ‌రంతేజ్ కూడా క‌థ, కాక‌ర‌కాయ్ గురించి ప‌ట్టించుకోకుండా స్టార్ డైరెక్ట‌ర్ అనే ముసుగులో ప‌డిపోయాడు. మొత్తానికి ఇంటిలిజెంట్ ను అమ్మింది అక్ష‌రాలా 27 కోట్లైతే.. వ‌చ్చేది మాత్రం 5 కోట్లు కూడా లేవు. ఈ లెక్క‌న అజ్ఞాత‌వాసి పెద్ద సినిమాల్లో ఎపిక్ అయితే.. మీడియం సినిమాల వంతును తాను తీసుకున్నాడు మెగా మేన‌ల్లుడు.

User Comments