మ‌హేశ్ సూర్యాభాయ్.. సాయిధ‌రం ధ‌ర్మాభాయ్..

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికే ఓ భాయ్ ఉన్నాడు. ఆయ‌నే మ‌హేశ్ బాబు. బిజినెస్ మ్యాన్ లో సూర్యా భాయ్ గా ర‌ప్ఫాడించాడు సూప‌ర్ స్టార్. ఇక ఇప్పుడు మ‌రో భాయ్ కూడా ఇండ‌స్ట్రీకి వ‌స్తున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో సాయిధ‌రంతేజ్ న‌టిస్తున్న సినిమాకు ధ‌ర్మాభాయ్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నారు. ఖైదీ నెం.150 త‌ర్వాత ఆర్నెళ్ల‌కు పైగా గ్యాప్ తీసుకుని ఇప్పుడు సాయిధ‌రంతేజ్ సినిమా చేస్తున్నాడు వినాయ‌క్. ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి యాక్ష‌న్ కామెడీగా తెర‌కెక్కిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఖైదీలో చిరంజీవి స్టైల్ కు త‌గ్గ‌ట్లు క‌త్తిని మార్చాడు వినాయ‌క్. ఇక ఇప్పుడు మ‌రోసారి ప‌క్కా మాస్ క‌థ‌తో వ‌స్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. ఆకుల శివ రాసిన క‌థ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్.. స‌త్యానంద్ త‌మ‌దైన శైలిలో మాట‌లు అందించారు. ఇక ఇప్పుడు అంద‌ర్లోనూ ఒక‌టే అనుమానం.. ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుందా అని..?
దీనికి ఓ స‌మాధానం కూడా తెలుస్తోంది.

ఈ చిత్రంలో సాయిధ‌రంతేజ్ మాటలతో ప‌డేసే పాత్ర‌లో న‌టిస్తున్నాడు. దీనికి మొద‌ట్లో దుర్గ అనే టైటిల్ ప్రచారంలోకి వ‌చ్చినా.. ఆ త‌ర్వాత చిరంజీవి పాత టైటిల్ కోత‌ల‌రాయుడు అనుకున్నారు.. ఆ వెంట‌నే ఇంట‌లిజెంట్ అన్నారు.. కానీ ఇప్పుడు మ‌రో ప‌వ‌ర్ ఫుల్ టైటిల్ బ‌య‌టికి వ‌చ్చింది. అదే ధ‌ర్మాభాయ్. ఫిబ్ర‌వ‌రిలోపు సినిమా షూటింగ్ పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. అన్నీ అనుకున్న‌ట్లు జ‌రిగితే 2018 మార్చ్ లో వినాయ‌క్-సాయిధ‌రంతేజ్ సినిమా విడుద‌ల కానుంది. లావ‌ణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. అస‌లే వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్న లావ‌ణ్య‌.. సాయిధ‌రంతేజ్ కు వినాయ‌క్ సినిమా వ‌రంగా మారింది. చూడాలిక.. ఈ సినిమాతో వాళ్ల కెరీర్ గాడిన ప‌డుతుందో లేదో..?