మెగా మేన‌ల్లుడు కూడా అచ్ఛం పవన్ లాగే

Last Updated on by

విన్న‌ర్ సినిమాలో ర‌కుల్ క‌ల‌ను నెర‌వేర్చ‌డానికి తాను తోడ్ప‌డ‌తాడు సాయిధ‌రంతేజ్. అయితే అక్క‌డ అది సినిమాలో.. కానీ నిజంగా కూడా ఓ ఆట‌గాడి క‌ల‌ను నెర‌వేర్చాడు సాయిధ‌రంతేజ్. త‌న‌కు ఉన్నంత‌లో సాయం చేయ‌డం మామ నుంచి నేర్చుకుంటున్నాడు మెగా మేన‌ల్లుడు. ఈయ‌న ఈ మ‌ధ్యే ఓ దివ్యాంగుడికి చేసిన చిన్న సాయం ఇప్పుడు పెద్ద‌గా మారిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పారా వాలిబాల్ ఆట‌గాడు న‌రేష్ యాద‌వ్ కు ల‌క్ష రూపాయ‌లు సాయం చేసి టోర్న‌మెంట్ కు పంపించాడు సాయి. ఇప్పుడు అత‌డు గోల్డ్ మెడ‌ల్ సాధించాడు. అది పూర్తిగా సాయిధ‌రంతేజ్ ఘ‌న‌తే అంటున్నాడు న‌రేష్. ఆయ‌న‌కు ఆయ‌న టీం కు సాయిధ‌రంతేజ్ కూడా కంగ్రాట్స్ చెప్పాడు. మెగా మేన‌ల్లుడుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు సాయిధ‌రంతేజ్.Sai dharam tej following Pawan kalyan Humanityఇప్ప‌టికే కొన్ని విజ‌యాలు ఉండ‌టంతో పాటు మాస్ ఇమేజ్ కూడా బ్ర‌హ్మాండంగా ఉంది ఈ హీరోకు. మామ‌య్య‌ల ఇమేజ్ వాడుకోవ‌డ‌మే కాదు.. అల‌వాట్ల‌లోనూ వాళ్ల‌నే ఫాలో అవుతున్నాడు సాయిధ‌రంతేజ్. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైల్లోనే ఎక్క‌డికి వ‌చ్చినా క‌నిపిస్తున్నాడు మెగా హీరో. అచ్చం మావ‌య్య మాదిరే కుడ్తా పైజామాకే ఫిక్స్ అయిపోయాడు సాయి. ఇక ఇప్పుడు సాయం చేయ‌డంలోనూ ప‌వ‌న్ నే త‌ల‌పిస్తున్నాడు ఈ హీరో. బ‌య‌ట ఎవ‌రికైనా సాయం కావాల్సి వ‌స్తే ముందు నిలిచే చేయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దే. ఇప్పుడు ఇదే దారిలో వెళ్తున్నాడు మెగా మేన‌ల్లుడు. తాజాగా న‌రేష్ యాద‌వ్ కు చేసిన సాయం అలాంటిదే. ఆయ‌న చేసిన సాయం చిన్న‌దే కావ‌చ్చు.. ఆ స‌మ‌యంలో అత‌డికి చాలా ఎక్కువ‌. మొత్తానికి మేన‌మామ‌ల పేరు నిల‌బెట్టేందుకు మ్యాగ్జిమ‌మ్ ట్రై చేస్తున్నాడు సాయిధ‌రంతేజ్.

User Comments