మామ‌కు త‌గ్గ అల్లుడు.. మెగా మేన‌ల్లుడు..!

Last Updated on by

మెగా మేన‌ల్లుడుగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి.. త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు కోసం పాకులాడుతున్నాడు సాయిధ‌రంతేజ్. ఇప్ప‌టికే కొన్ని విజ‌యాలు ఉండ‌టంతో పాటు మాస్ ఇమేజ్ కూడా బ్ర‌హ్మాండంగా ఉంది ఈ హీరోకు. మామ‌య్య‌ల ఇమేజ్ వాడుకోవ‌డ‌మే కాదు.. అల‌వాట్ల‌లోనూ వాళ్ల‌నే ఫాలో అవుతున్నాడు సాయిధ‌రంతేజ్. ముఖ్యంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైల్లోనే ఎక్క‌డికి వ‌చ్చినా క‌నిపిస్తున్నాడు మెగా హీరో. అచ్చం మావ‌య్య మాదిరే కుర్తా పైజామాకే ఫిక్స్ అయిపోయాడు సాయి. ఇక ఇప్పుడు సాయం చేయ‌డంలోనూ ప‌వ‌న్ నే త‌ల‌పిస్తున్నాడు ఈ హీరో. బ‌య‌ట ఎవ‌రికైనా సాయం కావాల్సి వ‌స్తే ముందు నిలిచే చేయి ప‌వ‌న్ క‌ళ్యాణ్ దే. ఇప్పుడు ఇదే దారిలో వెళ్తున్నాడు మెగా మేన‌ల్లుడు. తాజాగా ఈయ‌న ఓ దివ్యాంగుడికి సాయం చేసాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన రంగుల నరేష్‌ యాదవ్‌ దివ్యాంగుడు.

అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికైనా అక్కడికి వెళ్లేందుకు డబ్బులు లేక పారా అథ్లెట్ అయిన నరేష్ అనేక ఇక్కట్లు పడుతున్నాడు. ఈ నెల 31న ఓ ప్రముఖ పత్రికలో వచ్చిన కథనం చదవి వెంటనే హీరో సాయిధరంతేజ్‌ స్పందించారు. త‌న ఇంటికి పిలిపించుకుని నరేశ్‌ యాదవ్‌కు లక్ష రూపాయిల చెక్కును స్వయంగా అందజేశారు. అనంతరం నరేష్‌ గురించిన వివరాలు, వాలీబాల్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాలీబాల్‌ ఛాంపియన్‌షిప్‌లో విజయం సాధించాలని కోరుతూ నరేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు. సాయి చేసిన ఈ ప‌నితో అతడి ఇమేజ్ మ‌రింత పెరిగింది. ముఖ్యంగా ప‌వ‌న్ ను ఆద‌ర్శంగా తీసుకోవ‌డ‌మే కాదు.. అత‌డి ఆద‌ర్శాల‌ను కూడా తీసుకుంటున్నాడు సాయిధ‌రంతేజ్. మ‌రి ఫ్యూచ‌ర్ లో కూడా ఇలాగే మెగా మేన‌ల్లుడు ముందుకెళ్తాడేమో చూడాలి. ఈయ‌న న‌టించిన ఇంటిలిజెంట్ సినిమా ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది. వివి వినాయ‌క్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

User Comments