ఇంటిలిజెంట్.. ధ‌ర్మాభాయ్ వ‌స్తున్నాడు..

Last Updated on by

తెలుగు ఇండ‌స్ట్రీలో భాయ్ లు ఎక్కువైపోతున్నారు. ఆ మ‌ధ్య మ‌హేశ్ బాబు బిజినెస్ మ్యాన్ లో సూర్య భాయ్ అన్నాడు. ఆ త‌ర్వాత నాయ‌క్ లో చ‌ర‌ణ్ నాయ‌క్ భాయ్ అయ్యాడు. ఇప్పుడు సాయిధ‌రంతేజ్ ధ‌ర్మాభాయ్ అంటున్నాడు. పేదోళ్ల‌కు ప్లాట్ ఫామ్ అంటున్నాడు. ఈయ‌న న‌టించిన ఇంటిలిజెంట్ ట్రైల‌ర్ విడుద‌లైంది. వినాయ‌క్ తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. పైగా వ‌ర‌స‌గా నాలుగు ఫ్లాపుల త‌ర్వాత సాయి చేస్తోన్న సినిమా కావ‌డంతో ఆస‌క్తి మొద‌లైంది. ఇంటిలిజెంట్ ట్రైల‌ర్ చూస్తుంటే ఇది కూడా రొటీన్ క‌థ‌తోనే వ‌స్తుంద‌నే విష‌యం అర్థ‌మైపోతుంది. కానీ దానికి త‌న మార్క్ స్క్రీన్ ప్లే యాడ్ చేస్తున్నాడు వినాయ‌క్. ఎప్ప‌ట్లాగే కామెడీకి మ‌రోసారి పెద్ద‌పీట వేసాడు. ట్రైల‌ర్ లో సాయి ధ‌రంతేజ్ ను ఎంత‌గా హైలైట్ చేసాడో.. అదే స్థాయిలో కామెడీని కూడా చూపించాడు వినాయ‌క్.

సాయిధ‌రంతేజ్ కోసం ప‌క్కా మాస్ మ‌సాలా సినిమాను ద‌ట్టించి తీసుకొస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కామెడీ.. డాన్సులు.. యాక్ష‌న్.. మాస్ అంశాలు.. ఫ్యామిలీ ఎమోష‌న్స్.. ఇలా అన్నీ స‌మ‌పాళ్ల‌లో నింపి ఓ వంట‌కం సిద్ధం చేసాడు వినాయ‌క్. ల‌క్ష్మీ, కృష్ణ‌, నాయ‌క్ లాంటి సినిమాల‌కు క‌థ‌లు అందించిన ఆకుల శివ ఇంటిలిజెంట్ కు కూడా త‌న‌దైన శైలిలో ప‌క్కా మాస్ క‌థ‌ను సిద్ధం చేసి వినాయ‌క్ కు ఇచ్చాడు. ఫిబ్ర‌వ‌రి 9న విడుద‌ల కానుంది ఇంటిలిజెంట్. ఇంటిలిజెంట్ లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ గా క‌నిపిస్తున్నాడు సాయిధ‌రంతేజ్. త‌న ఫ్యామిలీకి జ‌రిగిన అన్యాయాన్ని ఎదుర్కొని.. ప‌గ తీర్చుకునే కుర్రాడిగా న‌టిస్తున్నాడు సుప్రీమ్ హీరో. 2014లో కుక‌ట్ ప‌ల్లిలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆధారంగా ఈ చిత్ర క‌థ రాసాన‌ని ఆకుల శివ చెప్పాడు. మ‌రి.. సాయితో క‌లిసి వినాయ‌క్ ఏం మాయ చేసుంటాడో..?

User Comments